Thursday, May 2, 2024

విశాఖే ఉత్తమం

- Advertisement -
- Advertisement -

Vishakha

 

హైదరాబాద్ ః ఎపి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ బెస్ట్ ఆష్షన్ అని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఎక్స్‌పర్ట్ కమిటి కన్వీనర్ జిఎన్ రావు తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు అనుకూలం కాదు అనడం కాదని, విశాఖ, మచిలీపట్నం, విజయవాడ లాంటి పట్టణాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పామన్నారు. దురదృష్టవశాత్తూ కొందరు కావాలనే తమ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. 40-50 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లంతా రిపోర్టు తయారు చేశారని, వారంతా ఢిల్లీ, మద్రాస్, బెంగళూరు నుండి వచ్చిన వారేనని జిఎన్ రావు చెప్పారు. జూన్ నెలలో 13 జిల్లాల్లో పర్యటించామన్నారు.

విశాఖ తీరంలో ప్రతికూల వాతావరణం ఉన్న మాట వాస్తవమేనని అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ని ఏర్పాటు చేయాలని తాము చెప్పలేదని, తీర ప్రాంతానికి దూరంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టంగా సూచించామన్నారు. సముద్ర తీరప్రాంతం కోతకు గురికాకుండా ఎవరూ ఆపలేరన్నారు. సముద్రానికి దగ్గర కాకుండా దూరంగా నిర్మించుకోవచ్చునని ఇప్పటికీ చెప్తున్నామన్నారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, స్వచ్ఛందంగా ఈ కమిటి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చామన్నారు. విశాఖ అనేది బెస్ట్ ఆప్షన్ కాబట్టే చెప్పామని, కర్నూల్‌లో హైకోర్ట్ పెడితే జిరాక్స్ సెంటర్‌లకే పరిమితం అవుతుంది అనే వాదన తప్పన్నారు.

అదే విధంగా అమరావతికి చెందిన చాలా మంది రైతులు తమ వద్దకు వచ్చి అభిప్రాయాలు చెప్పారని, రైతులకు ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలని తాను చెప్పినట్లు జిఎన్ రావు వెల్లడించారు. ఎపిలో సమర్థవంతమైన పాలన అందించేందుకు గాను రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించాలని సిఫారసు చేశామని ఆయన వెల్లడించారు. వివిధ నగరాల అభివృద్ధికి సంబంధించి అధ్యయనం చేశామని, అలాగే వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించామని జిఎన్ రావు తెలిపారు. దీనిలో భాగంగానే విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి గురించే తాము చెప్పామని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆయా నగరాల అభివృద్ధికి గల అడ్డంకుల్ని కూడా పరిశీలించామని, అభివృద్ధి వికేంద్రీకరణతోనే పేదరిక నిర్మూలన సాధ్యం కాగలదని జిఎన్ రావు అభిప్రాయపడ్డారు.

Vishakha Best as AP Executive Capital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News