Friday, May 17, 2024

పంట రుణ పరిమితి పెంపు

- Advertisement -
- Advertisement -

Debt limit for Crops

 

ఎకరా టమాటాకు రూ.45 వేలు రుణం
డ్రాగన్ ఫ్రూట్ సాగుకూ రూ.4.25 లక్షలు
శ్రీ వరికి రూ.36 వేలు, కందికి రూ.18 వేలు, పత్తికి రూ.38 వేలు
ఆయిల్‌పామ్ ఎకరాకు రూ.38 వేలు
120 పంటలకు 2020-21
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు

హైదరాబాద్: రాష్ట్రంలో సాగయ్యే వరి విత్తనోత్పత్తికి, శ్రీ వరి, కంది, శనగ, పెసర్ల, మినుము, ఆయిల్ ఫామ్, టమాట, వంకాయ కూరగాయల పంటలకు రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) పెరిగింది. వరి విత్తనోత్పత్తికి ఎకరాకు రూ.45 వేలు, శ్రీ వరికి ఎకరాకు రూ.36 వేలు, సాధారణ వరికి రూ. 38 వేలు, కందికి ఎకరాకు రూ.18 వేలకు రుణ పరిమితి పెంచుతూ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ నిర్ణయించింది. అలాగే ఈసారి కొత్తగా డ్రాగన్స్ ఫ్రూట్స్ సాగుకి రూ.4.25 లక్షల రుణ పరిమితిని ఖరారు చేసింది. సేంద్రీయ కూరగాయల సాగుకు ఎకరానికి రూ.40 వేలు ఇవ్వాలని పేర్కొంది. వివిధ రకాల పంటలకు సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను టెస్కాబ్ తాజాగా ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే దాదాపు 120 రకాల పంటలకు 202021 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది.

సంబంధిత నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి)కి పంపించింది. గతేడాదితో చూస్తే ఈసారి కొన్ని పంటలకు మాత్రమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగింది. పెరిగిన వాటిలో మినుములు ఎకరా సాగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలకు, పెసరకు రూ. 13 వేల నుంచి రూ.16 వేలకు, శనగకు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు రుణ పరిమితి విధించారు. అలాగే ఆయిల్‌పామ్‌కు రూ.35 వేల నుంచి రూ.38 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది. ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వనున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు చొప్పున స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేసింది.

సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఈ సారి ఆర్గానిక్ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. టమాట సాగుకు కూడా ఈసారి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచారు. సాగునీటి కింద వేసే టమాటకు రూ.40 వేల నుంచి రూ.45 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంది. వంకాయ (విత్ మల్చింగ్‌కు) ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ.45 వేలు రుణ పరిమితి ఖరారు చేశారు.

ప్రధాన పంటలకు ఇలా
తెలంగాణలో అత్యధికంగా సాగు చేసే వరికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.34 వేల నుంచి రూ. 38 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. వరి విత్తనోత్పత్తి రైతులకు రూ. 42 వేల నుంచి రూ. 45 వేలు ఖరారు చేశారు. పత్తికి రూ.35 వేల నుంచి రూ.38 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ.25 వేల నుంచి రూ.28 వేలు నిర్ధారించారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో రూ.20 వేల నుంచి రూ.23 వేలుగా నిర్ధారించారు. సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.17 వేల నుంచి రూ.20 వేలు చేశారు.

ఇక కంది విత్తనోత్పత్తి చేసే రైతులకు రూ.22 వేల నుంచి రూ. 27 వేలు చేశారు. సోయాబీన్‌కు రూ.22 వేల నుంచి రూ.24 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ.28 వేల నుంచి రూ.31 వేల వరకు ఇస్తారు. మెడికల్, ఎరోమాటిక్ ప్లాంట్స్‌కు రే.35 వేల నుంచి రూ.40 వేల, రూఫ్ గార్డెన్‌కు స్టేజ్‌ల వారీగా మొదటిసారి రూ.9 వేల నుంచి రూ.10 వేలు రెండో స్టేజ్‌లో రూ.18 వేల నుంచి రూ.20 వేలు మూడో స్టేజ్‌లో రూ. 27 వేల నుంచి రూ.30 ఇవ్వాలని నిర్ణయించారు.

డ్రాగన్ తరువాత ద్రాక్ష
డ్రాగన్ ఫ్రూట్ తరువాత అత్యధికంగా విత్తనరహిత ద్రాక్షకు రూ.1.2 లక్షల నుంచి రూ.1.25 లక్షలు రుణం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరను మార్చలేదు. దాంతోపాటు పత్తి విత్తనాన్ని సాగు చేస్తే రూ.1.1 లక్షల నుంచి రూ.1.4 లక్షలకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ.60 వేల నుంచి రూ.68 వేలు చేశారు. క్యాప్సికానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖరారు చేశారు. ఉల్లిగడ్డకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు, పుచ్చకాయకు రూ.25 వేల నుంచి రూ.27 వేలకు పెంచారు.

ఒక్క ఆవుకు రూ.12,500
వ్యవసాయ అనుంబంధ రంగాల్లో డెయిరీ కింద పాడి పశువుల కొనుగోలునకు ఒక్కదానికి రూ.22 వేల చొప్పున రుణం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక గొర్రెల కొనుగోలుకు (21కి) రూ.12,500 ఇవ్వనున్నారు. ఒక హెక్టార్‌లో చేపల పెంపకానికి రూ.2.33 లక్షల రుణం ఖరారు చేశారు. పౌల్ట్రీలో బ్రాయిలర్స్ కొనుగోలునకు ఒక్కొదానికి రూ.150 చొప్పున, లేయర్స్‌కు రూ.310 చొప్పున ఇవ్వనున్నారు.

Debt limit for Crops has Increased
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News