Friday, May 10, 2024

రాష్ట్రంలో కరోనా లేదు

- Advertisement -
- Advertisement -

Coronavirus

 

అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం

చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం
పుణె ల్యాబ్‌కు పంపించాం
అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం
గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం
పౌరులు భయపడవల్సిన పనిలేదు అప్రమత్తంగా ఉండాలి
మేడారం జాతరలోనూ ప్రత్యేక ఆసుపత్రి నెలకొల్పుతాం : సమీక్ష అనంతరం మంత్రి ఈటల

హైదరాబాద్: కరోనావైరస్ తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తిలో లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ మేరుకు బుధవారం జూబ్లిహిల్స్‌లోని ఆరోగ్య శ్రీ ట్రస్టు ఆఫీసు కేంద్రంలో విస్తృతంగా ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో కరోనా వైరస్, వ్యాప్తి, ముందస్తు జాగ్రత్తలు, మేడారం జాతర సందర్భంగా ఆరోగ్య శాఖ ఏర్పాట్ల పై సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చైనా దేశం నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమునాలను సేకరించామన్నారు. ఈ నమూనాలను పూణే ల్యాబ్‌కు పంపిచామని వివరించారు. ఇందులో ఐదు గురి ల్యాబ్ ఫలితాలు అనుమానంగా వచ్చాయని, ఇలాంటి అనుమానిత బాధితులను ప్రత్యేక వార్డులల్లో చికిత్స అందిస్తున్నామన్నారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం సూచనలకు మేరకు గాంధీ, ఫీవర్, ఛాతి ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. ఈ వ్యాధి కూడా సైన్‌ప్లూ లాంటి లక్షణాలను కలిగి ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు భారతదేశంలోనూ, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదన్నారు. కరోనా వైరస్ కొత్తది వైరస్ కావడం మూలంగా పూర్తి స్థాయి మందులు లేకపోవడం మూలంగా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైదరాబాద్‌లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర అనుమతులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. చైనా, భూటాన్ దేశాలో వైరస్ బాధితుల పై కేంద్ర ప్రభుత్వంలో తెలుగు విద్యార్ధుల సమాచారం.

రాష్ట్రంలో కరొనా వైరస్ అంశాలను పర్యవేక్షణకు గాను ప్రివెంటెన్షన్ మెడిసిన్ స్పెషలిస్టు డా.విజయకుమార్‌ను నోడల్ అధికారిగా నియమించామన్నారు. అలాగే ఈ వైరస్ అనుమానితులకు హైదరాబాద్‌లో వంద పడకలను సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్రంలోని ప్రజలు భయపడాల్సిన అవసరంలేదన్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరొనా వైరస్ విస్తరించే అవకాశం లేదన్నారు. ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా మేడారం జాతరలో ప్రజలకు సమీపంలో ఆసుపత్రుల్లో హై అలర్ట్ జారీ చేశామన్నారు. మేడారం జాతర భక్తుల ఆరోగ్య శ్రేయస్సు సౌకర్యార్ధం 50 పడుకల ప్రత్యేక ఆసుపత్రి సిద్ధం చేస్తామన్నారు. 20కు పైగా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు.

అలాగే 102,104,108 లాంటి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా అంబులెన్స్‌లను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకు గాను ఆరు మంది జిల్లా వైద్యఅధికారులు, 13 మంది పుడ్ ఇన్స్‌ప్పెక్టర్‌లకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి వైరస్ సొకుండా కనీస ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను పాటించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్శిని, ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్, ఫీవర్ ఆసుపత్రి సూపరిండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రిలో వైద్య సేవలను
పర్యవేక్షించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

రాష్ట్రంలో వరంగల్, హైదరాబాద్ ఆయుర్వేద ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రోగులకు సేవలు అందజేస్తున్న తీరు తెన్నులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పర్యవేక్షించారు. ఈ మేరకు బుధవారం ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాళాలను సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వైద్య సేవలు, రోగుల వార్డుల తాజా పరిస్థితులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఈ మేరకు కీళ్ళ నోప్పులు, స్పాడిలైట్స్ లాంటి వైద్య సేవలను అందజేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే నేరోపతి, ఆయుర్వేద, హుమియో లాంటి భారతీయ, ప్రాచీన వైద్య సేవలకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఆయుర్వేదిక్ ఆసుపత్రిలు మన్నలు పొందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

Coronavirus is not in Telangana state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News