Sunday, April 28, 2024

త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

Dummugudem project

 

కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు?
కేంద్రం నుంచి అందని సాయం
సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం

హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు. ఫిబ్రవరిలో శంఖుస్థాపన చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యత, లక్షల ఎకరాలకు సాగునీరు, ఆనేక పట్టణాలకు తాగునీరు అందించే దుమ్ముగూడెం ప్రాజెక్టు కాళేశ్వరం అనంతం మరో పెద్దప్రాజెక్టుగా ఇంజనీర్లు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం దగ్గర సజీవంగా పారే గోదావరి దగ్గర 120 రోజులు వరదలతో సముద్రంలో కలిసే జలాలకు అడ్డుగా భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు అవసరమైన అన్నిచర్యలను ప్రభుత్వం తీసుకుంది. సమైక్య ప్రభుత్వంలో టిడిపి, కాంగ్రెస్ పాలకులు ఇక్కడ అనేకపేర్లతో విడివిడిగా ప్రాజెక్టుల నిర్మాణాలకు డిపిఆర్‌లు పూర్తిచేసిన తెంలగాణ జలవనరులకు గండికొట్టే ప్రయత్నం జరిగిందని ప్రభుత్వం భావించింది.

అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టులరీడిజనింగ్ చేసి ఇప్పటికే అనేక ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఇందులో భాగంగా దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజనింగ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ సహకారంతో దుమ్ముగూడెం రీడిజనింగ్ చేసి మంత్రి వర్గ అమోదం తీసుకున్నారు. పరిపాలనా పరమైన అనుమతులు, భూసేకరణ పూర్తి అయ్యాయి. ఇక పనులను ప్రారంభించడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్రాజెక్టు పనులకు శంఖు స్థాపన చేసి వేసవిలో రాత్రింబవళ్లు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అలోచిస్తోంది. దుమ్ముగూడెం బహుళార్థసాధక ప్రాజెక్టు పూర్తి అయితే పూర్వ ఖమ్మంజిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు తాగు, సాగు నీరు పుష్కలంగా అందే వకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్నఅంచనావ్యయం మేరకు రూ.13,500 కోట్ల నుంచి రూ.14 వేల కోట్లవరకు ఈ ప్రాజెక్టునిర్మాణానికి ఖర్చు కానుంది.

ఫిబ్రవరిలో జరగ నున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించ నున్నట్లు తెలిసింది. అలాగే బయ్యారం వరకు సాగునీరు అందడంతో దుమ్ము గూడెం పూర్తి అయితే ఐదున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. 35 నుంచి 40 టిఎంసిల గోదావరి జలాలు ఈ ప్రాజెక్టులో ఎప్పుడూ అందుబాటులో ఉండటంతో సమీప ప్రాజెక్టులకు లిఫ్ట్‌ల ద్వారా నీరు అందించేందుకు కూడా పనులు ప్రారంభం కానున్నాయి. దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణంతో మిగులు జలాలు అధికం అవుతుండటంతో కాళేశ్వరం నుంచి 2 టిఎంసిల నీరు మల్లన్నసాగర్‌కు మూడు టిఎంసిల నీటితో నింపేందుకు చర్యలు ప్రారంభిస్తున్నారు. వచ్చే సంవత్సంరం ఈ ప్రాజెక్టులకు నీరు చేరనుందనే ఆశాభావం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే దుమ్మూగూడెం ప్రాజెక్టు జల వనరులతో 380 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరిగే విధంగా విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరగ నుంది.

సమైక్య పాల్కులు దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణం తో నీటిని తరలించుకు పోవాలని ప్రయత్నిస్తే తెలంగాణ ఏర్పడిన అనంతరం సాగునీటి ప్రాజెక్టుల డిజన్లను మార్చి సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలకు అడ్డుకట్టవేస్తూ సిఎం కెసిఆర్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో సాగునీరు అందడంతో వలసలు వాపస్ వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. దుమ్ముగూడెం బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణంతో ఖమ్మం సస్యశ్యామలం కానుంది.

అయితే ఎత్తిపోతల పథకాలకు, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని ఎన్నిపర్యాయాలు కోరినా, నీతి అయోగ్ కేంద్రానికి నివేదికలు ఇచ్చినా వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ ప్రశంసించినా కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందలేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం సోంత నిధులతోనే దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఖమ్మంజిల్లాలో కాకతీయులు తవ్వించిన చెరువుల్లో తిరిగి జలకళ సంతరించుకునే అవకాశాలున్నాయని సాగునీటి నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిబ్రవరిలో ప్రాజెక్టు నిర్మాణపనులకు శంఖు స్థాపన చేసి నిర్మాణపనులను వేగవంతం చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

CM KCR starts to Dummugudem project
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News