Tuesday, December 10, 2024

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారు !

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ భారత పర్యటన ఖరారయింది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి వెల్లడించారు. పుతిన్ అతి త్వరలోనే భారత్ పర్యటిస్తారని అధికారిక ప్రకటన విడుదల చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన భారత్ కు రాబూనడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇదిలావుండగా అణ్వాయుధాల వినియోగాన్ని అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేశారు. దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అనుమతించిన వేళ పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే, దానిని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని కీలక దస్త్రంలో పుతిన్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News