Sunday, June 16, 2024

రాజ్యాంగ పరిరక్షణకు ఓటే ఆయుధం: సోనియా

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ పరిరక్షణకు ఓటే ఆయుధం
సోనియా గాంధీ వీడియో సందేశం
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి తుది రోజు నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గురువారం వీడియో సందేశం వెలువరించారు. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావని, ప్రమాదంలో పడ్డ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సి ఉందని, ఈ దిశలో ప్రజలు కూడా పాలుపంచుకోవాలని కోరారు. ఢిల్లీలో మొత్తం ఏడు ఎంపి స్థానాలలోనూ ఇండియా కూటమి అభ్యర్థులు గెలిచేలా చేయడం అందరి బాధ్యత అని చెప్పారు. ఎవరూ తమ ఓటును తక్కువ అంచనా వేసుకోవద్దు .మీ ఓటు విలువ ఎంతో అమూల్యం. మీ ఈ ప్రతి ఒక్క ఓటు ఉద్యోగకల్పనకు దారితీస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గిస్తుంది. మహిళా సాధికారికతకు వీలు కల్పిస్తుంది. ఉజ్వల భవిత గల భారత్‌లో సమానత వెల్లివిరుస్తుంది. అయితే ఈ ఓటును మీరు ఏ విధంగా వాడుకుంటున్నారనే దానిపైనే దీని విలువ సార్థకం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News