Thursday, May 2, 2024

కుక్క ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు

- Advertisement -
- Advertisement -

Voter

 

ఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ సాధారణ వ్యక్తులకు హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల పేర్ల మీద తప్పుడు ఓటరు గుర్తింపు కార్డులు గతంలో జారీ చేశారు. గతంలో పలుమార్లు ఓటర్ కార్డులలో తప్పులు దొర్లాయి. ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తికి కుక్క ఫొటో పెట్టి ఓటరుకు గుర్తింపు కార్డును జిల్లా ఎన్నికల అధికారులు అందజేశారు. దీంతో సదరు ఓటరు అవాక్కయ్యాడు. తన ఫొటో బదులు శునకం ఫొటో వచ్చిందని మీడియాకు తెలిపాడు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ ప్రాంతం రామ్‌నగర్ గ్రామంలో సునీల్ కర్మాకర్ అనే వ్యక్తికి కుక్క ఫొటో ఉన్న ఓటరు గుర్తింపు కార్డును స్థానిక ఎన్నికల అధికారులు అందజేశారు. కర్మాకర్ గతంలో ఓటరు కార్డు ఉన్నప్పటికి పేరులో తప్పు ఉండడంతో ఆన్‌లైన్‌లో సరి చేయించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా కుక్క బొమ్మ ఉన్న ఓటరు కార్డు రావడంతో ఏ చేయాలో అతడికి తోచడం లేదు. స్థానిక బిడిఒ అధికారి మీడియాతో మాట్లాడుతూ… గతంలో ఆయన పేరు తప్పుగా పడడంతో సరి చేశామని, కానీ ఇప్పుడు ఏకంగా కుక్క ఫొటో రావడంతో తమ తప్పిదమేనని, కానీ ఓటరు జాబిత ఇదే చివరది కాదని, ఇంకా ఏమైనా తప్పులు ఉంటే సరి చేసి ఇస్తామని బిడిఒ అధికారి మీడియాకు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News