Sunday, May 5, 2024

విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో ఆరు లక్షల ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో మాట్లాడారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు చేశారని, కరోనా రోగుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రతి ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులకు సూచించారు. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించామని హర్షవర్ధన్ వివరించారు. ఎయిర్‌పోర్టుల్లోనే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయిస్తున్నామన్నారు. జపాన్, దక్షిణ కోరియా, ఇరాన్, చైనా వంటి దేశాలకు వీసాలు రద్దు చేశామని వెల్లడించారు. మార్చి 4వ తేదీ వరకు 29 మంది కరోనా  బారినా పడ్డారని హర్షవర్థన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News