Saturday, August 9, 2025

భారీ వర్షం.. గోడ కూలి ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీలోని జైత్పూర్‌లో ఉన్న మోహన్ బాబా మందిర్ సమీపంలో ఓ గోడ కూలి ఏడుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా ఢిల్లీ ఫైర్ సర్వీస్(డిఎఫ్‌సి) దీనికి ముందు ఎనిమిది మంది మరణించారని పేర్కొంది. అయితే తర్వాత పోలీసులు ఏడుగురు చనిపోయారని, ఒకరికి గాయాలై చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గోడ కూలిన సమాచారం తమకు ఉదయం 9.16 గంటలకు అందిందని డిఎఫ్‌సి అధికారులు తెలిపారు. ఇదిలావుండగా భారత వాతావరణ శాఖ శనివారం రెడ్ అలర్ట్ జారీచేసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెస్కూ ఆపరేషన్లను చేపట్టారు. అదనపు డిసిపి(ఆగ్నేయం) ఐశ్వర్య శర్మ, ఎసిపి రవిశంకర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఢిల్లీలో 300 విమానాల రాకపోకలు ఆలస్యం
ఢిల్లీ విమానాశ్రయంలో శనివారం కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా 300కు పైగా విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి. అయితే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల మళ్లింపు ఏదీ జరుగలేదని ఓ అధికారి స్పష్టం చేశారు. దేశంలో అతిపెద్ద విమానాశ్రయం అయిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రోజుకు దాదాపు 1300 విమానాలను హ్యాండ్లింగ్ చేస్తుంటుంది. ఇదిలావుండగా ప్రతి విమానం డిపార్చర్లలో 17 నిమిషాలు ఆలస్యం, అలాగే కొన్ని విమానాలను రద్దు చేసినట్లు వెబ్‌సైట్ ‘ఫ్లయిట్‌రాడార్24 డాట్ కామ్’ డేటా ద్వారా తెలుస్తోంది. వాతావరణ శాఖ డేటా ప్రకారం ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌లో 78.7 మిమీ, ప్రగతి మైదాన్‌లో 100 మిమీ., లోధి రోడ్డులో 80 మిమీ., పుసలో 69 మిమీ, పాలంలో 31.8 మిమీ. వర్షపాతం నమోదయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News