Thursday, May 2, 2024

అందువల్లే ఓడిపోతున్నాం..

- Advertisement -
- Advertisement -

We lose matches due to failure batting: David Warner

దుబాయి: ఈ సీజన్‌లో తమను బ్యాటింగ్ వైఫల్యం వెంటాడుతుందని, అందువల్లే వరుస ఓటములు తప్పడం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. జట్టును ముందుండి నడపించడంలో తాను కూడా విఫలమవుతున్న విషయాన్ని వార్నర్ ఒప్పుకున్నాడు. బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యం తమను వెంటాడుతుందన్నాడు. ప్రస్తుతం జట్టులో విలియమ్సన్, బైర్‌స్టో మాత్రమే నిలకడగా రాణిస్తున్నారన్నాడు. మిగతావారిలో నిలకడలో లోపించింద న్నాడు. ఇందులో తాను కూడా ఉన్నట్టు వార్నర్ స్పష్టం చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యం మరి క్లిష్టంగా ఏమీ లేదని, ఏ ఇద్దరు రాణించినా గెలుపు దక్కెదన్నాడు. కానీ తనతో పాటు బైర్‌స్టో, మనీష్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో మ్యాచ్ చేజారిందన్నాడు. విలియమ్సన్ ఒంటరి పోరాటం చేసినా అతనికి సహకరించే వారు లేకుండా పోయారన్నాడు. రానున్న మ్యాచుల్లో బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకునేందుకు కృష్ణి చేస్తామని పేర్కొన్నాడు.

We lose matches due to failure batting: David Warner

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News