Thursday, May 2, 2024

కోవిడ్‌పై అవిశ్రాంతం పోరాటం చేస్తాం: ఉపాసన

- Advertisement -
- Advertisement -

We will fight tirelessly against Covid Says upasana

హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నుండి ఉపశమనం కలిగించడానికి దేశ వ్యాప్తంగా ఉన్న సమాజాల్లో దెబ్బతిన్న పలు విభాగాలకు సహాయం అందించాలని అవిశ్రాతంగా పనిచేస్తున్నట్లు అపోలో ఫౌండేషన్ పేర్కొంది. ఇప్పటివరకు మహిళా సాధికారత, రెండులక్షల కుటుంబాలకు ఫేస్‌మాస్కుల ఉత్పత్తి, 60వేల మందికి ఫేస్‌మాస్కులు, 1238 పిపిఇ కిట్లు, అరగొండలో 47గ్రామాల కుటుంబాలకు సరుకులు పంపిణి చేసినట్లు చెప్పారు.

ఈసందర్భంగా అపోలో వైస్ చైరపర్సన్ ఉపాసన కామినేని మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాలపై మహమ్మారి చాలా ప్రభావం చూపిందని, రాబోయే రెండు సంవత్సరాలలో పేదలకు బలాన్ని, మద్దతు, సానుకూలతను అందించాలని పేర్కొన్నారు. ఔదర్యం అనే సంపదను పంచడంలో ఉండదు, ప్రజలను సాధికారులను చేయడంలో వారికి నైపుణ్యాలను అందించడంలో వారికి మద్దతుగా ఉండటంతో వారికి భావోద్యేగ మద్దతును అందివ్వడంలో ఇలాంటి క్లిష్టపరిస్దితుల్లో అందించడంలో మార్గనిర్దేశం చేయడంలో ఉంటుందన్నారు.

We will fight tirelessly against Covid Says upasana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News