Saturday, April 27, 2024

ముంబయి ‘ఇండియా’ భేటీకి వెళ్తాం :కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిపై పోరాటానికి ఏర్పడిన ఇండియా కూటమి మూడో సమావేశం ఈ నెలాఖరులో ముంబయిలో జరగనున్న నేపథ్యంలో ఆ సమావేశంలో పాల్గొనే విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరిపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టత ఇచ్చారు. ముంబయి సమావేశానికి తాము వెళ్తామని, కూటమి వ్యూహం ఏమిటనే దానిపై ఆ తర్వాత తెలియజేస్త్తామని చెప్పారు. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ ఢిల్లీ విభాగానికి కాంగ్రెస్ ఇటీవల పిలుపునివ్వడంతో ఆ పార్టీ నేతలు, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబయిలో ఇండియా కూటమి సమావేశం జరగనున్న విషయం తెలిసిందే.ఈ సమావేశానికి శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి కాంగ్రెస్‌తో కలిసి సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

కేజ్రీవాల్ ఇటీవల మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో అటు బిజెపితో పాటుగా ఇటు కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆరెండు పార్టీలు( కాంగ్రెస్, బిజెపి) రాష్ట్రాన్ని గత 75 ఏళ్లుగా పాలిస్తున్నాయని, అయినా ఏ పార్టీ కూడా రాష్ట్రానికి కరెంటు ఇవ్వలేకపోయాయని విమర్శించారు.‘ మీకు పవర్ సప్లై కావాలంటే ఆప్‌కు ఓటేయండి. పవర్ అక్కర్లేదనుకుంటే ఆరెండు పార్టీలకే వేయండి’ అని అన్నారు. దీనిపై కూడా కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ఇండియా కూటమి మూడో సమావేశం ముంబయిలో జరగనుంది. నేషనల్ క్యాపిటల్ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేక పోవడంతో పాట్నాలో జరిగిన కూటమి తొలి సమావేశానికి ఆప్ దూరంగా ఉండిపోయింది. అయితే ఆ తర్వాత ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఆప్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో బెంగళూరులో జరిగిన కూటమి రెండో సమావేశంలో ఆప్ పాల్గొంది. ఇప్పుడు మూడో సమావేశానికి కూడా సిద్ధమవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News