Thursday, May 2, 2024

మోదిని ‘అన్‌ఫాలో’ చేసిన వైట్‌హౌజ్

- Advertisement -
- Advertisement -

trump modi

 

మన తెలంగాణ/హై-దరాబాద్ : భారత ప్రధాని నరేంద్రమోదీ, రాప్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని కార్యాలయం ట్విటర్ ఖాతాలను వైట్‌హౌజ్ అన్‌ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. ఇందుకు గల కారణాలేంటో వెల్లడించలేదు. మూడు వారాల క్రితం వైట్‌హౌజ్ అనుసరిస్తున్న ఏకైక ప్రపంచ నేతగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించిన సంగతి విదితమే. వైట్‌హౌజ్ అమెరికా అధ్యక్షుడి నివాస భవనం. ప్రస్తుతం వైట్‌హౌజ్ ట్విటర్ ఖాతాను దాదాపు రెండు కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఏప్రిల్ 10 నుంచి వైట్‌హౌజ్ మోదీని అనుసరించడం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీ మధ్య స్నేహం, సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఇలా చేసింది. ఆ తర్వాత ట్రంప్ కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై ఆంక్షలను మోదీ సడలించిన సంగతి విదితమే.

 

White House Unfollow PM Modi on Twitter
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News