Tuesday, April 30, 2024

మహిళా కానిస్టేబుల్ హనీ ట్రాప్

- Advertisement -
- Advertisement -

Woman Constable Honey Trap in Hyderabad

ప్రేమ పేరుతో డబ్బులు వసూలు
పోలీస్ అడ్డుపెట్టుకుని బెదిరింపులు
ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు
గతంలో ముగ్గురిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది
వేదింపులు భరించలే ఆత్మహత్య చేసుకున్న ఓ బాధితుడు
సంధ్యారాణి నుంచి కాపాడాలని మరో బాధితుడి వేడుకోలు

మనతెలంగాణ, హైదరాబాద్ : ప్రేమ పేరుతో పలువురికి వల వేసి మోసం చేసిన మహిళా కానిస్టేబుల్ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఎఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిలాడీలేడి సంధ్యరాణి డబ్బుల కోసం మూడు వివాహాలు చేసుకుని డబ్బులు దండుకుంది. కూతురు చేష్టలు భరించలేక ఆమె తల్లిదండ్రులు ఏకంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతోందని తల్లిదండ్రులు తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంధ్యారాణి గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. భర్తను నిత్యం వేధించడంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత మరొకరిని వివాహం చేసుకుంది సంధ్యారాణి వేధింపులకు తాళలేక విడాకులు తీసుకున్నాడు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తర్వాత హైదరాబాద్‌కు ఉద్యోగం కోసం వచ్చిన షాబాద్ మండలం హైతబాద్‌కు చెందిన చరణ్‌తేజను ట్రాప్ చేసిన సంధ్యారాణి గతంలో తనకు వివాహం జరిగిన విషయం దాచిపెట్టి నవంబర్, 2020లో ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకుంది. కొద్ది రోజులు సహజీవనం చేసిన ఇద్దరు వివాహం చేసుకునేందుకు చరణ్ నిరాకరించాడు. దీంతో తనను వివాహం చేసుకోకుంటే అట్రాసిటీ కేసు పెడుతానని, కలిసి తిరిగిన ఫొటోలు బయటపెడుతానని బెదిరించడంతో వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత అన్ని విషయాలు తెలియడంతో చరణ్ పారిపోయాడు. వెంటనే తన పోలీస్ పవర్‌ను ఉపయోగించి జవనవరి,2021లో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసుల సాయంతో చరణ్‌తో బాండ్ పేపర్ రాయించుకుంది. వివాహం జరగకుండానే చరణ్‌ను తన భర్తగా పేర్కొంటూ పోలీసుల హెల్త్ కార్డులో పేరు నమోదు చేయింది.

సంధ్యారాణి వేదింపులను తాళలేక చరణ్ ఆమె ట్రాప్ నుంచి రక్షించాలని శంషాబాద్ డిసిపి, షాబాద్ పోలీసులకు, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. సంధ్యారాణి బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు. ఒంటరిగా ఉన్న ఉంటున్న యువకులను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తోందని ఫిర్యాదు చేశాడు. ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో కాకుండా సపరేట్‌గా రూమ్ తీసుకుని ఉంటుందని తెలిపాడు. తనను క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ కావాలని, చర్చిలో పనిచేయాలని ఒత్తిడి చేసిందని ఆరోపించాడు. సంధ్యారాణిని సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News