Tuesday, April 30, 2024

మహిళలు తమ స్వంత వ్యాపార రంగంలో రాణించాలి : మేయర్

- Advertisement -
- Advertisement -

మాదాపూర్ ః మహిళలు వ్యాపార రంగంలో రాణించి తమ కాళ్ళపై తాము ఎదిగేందుకు కృషి చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిభిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టైల్ తత్వ 2023 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై ఉమెన్ అండ్ సేఫ్టీ అడిషనల్ డిజిపి ఐపిఎస్ శిఖా గోయల్, ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ అధ్యక్షురాలు సుధా శివకుమార్‌తో పాటు ఎఫ్‌ఎల్‌ఓ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు మహిళలను ప్రోత్సహించేందుకు దేశంలోని నూతన మహిళా వ్యాపారును ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయమని అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళ వ్యాపారస్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి తమదైన శైలిలో వారిని ప్రోత్సహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఓకు అభినందనలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలనే కాకుండా వీవర్స్‌ను సైతం ప్రోత్సహించేందుకు ఉచితంగా స్టాల్స్‌ను అందించడం సంతోషకరమన్నారు. మహిళలు స్వతహగా ఎదిగి ఇతరులకు సైతం ఉపాధి కల్పించే దిశగా ఎదాగాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఓ నేత కార్మికులకు సైతం చోటును అందించి అండగా నిలుస్తుందన్నారు. మెట్రో నగరాల్లో లైప్ స్టైల్, ఫ్యాషన్ ఈవెంట్స్ అనేవి సర్వసాధారణమన్నారు. ఉమెన్ అండ్ సేఫ్టీ అడిషనల్ డిజిపి, ఐపిఎస్ శఙఖా గోయల్ అన్నారు. వ్యాపార రంగాల్లో మనుగడ సాధించాలంటే అనేక లక్షాలతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం మనం గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం కారణంగా ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రత, 1.2 డిగ్రీలు పెరిగడం చూస్తున్నామన్నారు.

ప్రస్తుత తరుణంలో తక్కువ నీటి వినియోగంతో ఆధిక శక్తి అందించడం అవసరమన్నారు. స్థిరమైన ఫ్యాషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఫ్యాషన్ డిజైనర్లందరిని కోరింది. సుస్థిరత, నేటి అవశ్యకత ఇతివృత్తంగా నిలిచిందన్నారు. ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ అధ్యక్షురాలు సుధా శివకుమార్ అన్నారు. నేత కార్మికుల సవాళ్ళు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఇందులో భాగంగా చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచే ప్రాజెక్ట్ కొరకు ప్రభుత్వం రూ..30లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు.

ఈ ప్రదర్శనలో 240కి పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ఎగ్జిబిటర్ బ్యాడ్జ్‌లు, కాటన్, రిబ్బన్, హ్యండ్ మేడ్ పేపర్‌లు, వాటర్ బాటిళ్ళు, షాపింగ్ బ్యాగ్‌లు, కాన్వాస్ బ్యాగులు, చేతితో తయారు చేసిన ఇన్విటేషన్‌లు, పర్యావరణానికి అనుకూలమైన ఇంక్‌తో కూడిన కంపోస్టబుల్ పేపర్‌లతో పాటు దుస్తులు వంటి వాటిని ప్రదర్శించారు. రాష్ట్ర నలు మూలల నుండి ఈ ప్రదర్శనను వీక్షించేందుకు రెండు రోజుల్లో కలిసి 10 నుండి 12 వేలకు పైగా సందర్శకులు విచ్చేయనున్నట్లు నిర్వహకుల అంచనా. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు, ఎఫ్‌ఎల్‌ఓ సభ్యులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News