Friday, May 3, 2024

మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యత: సిపి సజ్జనార్

- Advertisement -
- Advertisement -

Women's safety is the first priority Says CP Sajjanar

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సిపి సజ్జనార్ అంబులెన్సులను శుక్రవారం ప్రారంభించారు. షీ బృందం ఆధ్వర్యంలో మూడు గస్తీ వాహనాలను ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గృహహింస బాధితుల కోసం ప్రత్యేకంగా గస్తీ నిర్వహించడానికి వాహనాలను ప్రారంభించాం. రాష్ట్రంలో మహిళల భధ్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. డయల్ 100కు వచ్చే కాల్స్ తో 40శాతం మహిళలవే చేస్తున్నారు. బాధిత మహిళ కోసం ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఈ పెట్రోలింగ్ వాహనాల్లో నలుగురు సిబ్బంది ఉంటారు.

బాధిత మహిళలను తక్షణమే రక్షించడానికి ఉపయోగపడుతోంది. 27 మంది ప్లాస్మా దానం చేేసేందుకు ముందుకొచ్చారు. వాళ్ల నుంచి 54మందికి ప్లాస్మా ఇచ్చాం. ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమే. ప్లాస్మా ఇచ్చే వాళ్లను సమన్వయం చేయడానికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాము. ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు రావాలి. ప్లాస్మా ఇచ్చేందుకు ఆసక్తి గలవారు 9490617440ను సంప్రదించొచ్చు. donateplasma.scsc.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News