Friday, April 26, 2024

నకిలీ మెయిల్‌పై క్లిక్.. రూ.32 లక్షలు పొగొట్టుకున్నాడు….

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఓ బిజినెస్ మ్యాన్ నకిలీ మెయిల్‌కు స్పందించి 32 లక్షల రూపాయలు పొగొట్టుకున్న సంఘటన మహారాష్ట్రలోని కందివాలి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తికి సెంద్రీయ రసాయన పదార్థాల కంపెనీ ఉంది. విదేశాల నుంచి కెమికల్ మెటీరియల్ ను కొనుగోలు చేసేవాడు. ఘనా దేశం నుంచి ఓ మెడికల్ కంపెనీ 38 కెజీల  కెమికల్ మెటీరియల్ పంపిస్తామని అడ్వాన్స్ కట్టాలని బిజినెస్ మ్యాన్ కు తెలిపింది. బిజినెస్ మ్యాన్ అడ్వాన్స్ కింద 15 లక్షల రూపాయలు ఇస్తానని ఆన్‌లైన్‌లో తెలిపాడు. అడ్వాన్స్ రూ.32 లక్షలు ఇవ్వాలని కంపెనీ అతడికి తెలిపింది. జూన్ నెలలో మెయిల్‌పై క్లిక్ చేసి తన డెబిట్ కార్డు ద్వారా 32.64 లక్షల రూపాయల నగదును బదిలీ చేశాడు. నెల రోజుల గడిచిని సెంద్రీయ రసాయన పదార్థాలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సమతా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉండే కంపెనీలకు నగదు బదిలీ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని బదిలీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో మోసాలు మితిమీరిపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News