Sunday, April 28, 2024

వర్క్‌ఫ్రం హోం పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

Work from Home scam busted in Hyderabad

 

రూ.2.5లక్షలు ముంచిన నిందితులు
చైనా నేరస్థులతో కలిసి మోసాలు
అరెస్టు చేసిన నగర సిసిఎస్ పోలీసులు

హైదరాబాద్: ఇంటి వద్ద కూర్చుని సులభంగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పి ఓ బాధితురాలిని మోసం చేసిన ఇద్దరు నిందితులను నగర సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఐదు చెక్‌బుక్‌లు, నాలుగు డెబిట్ కార్డులు, ఐదు రబ్బర్ స్టాంపులు, రూ.21,500 నగదు, బ్యాంక్‌లోని రూ.19లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన అడబాల శ్రీనివాస రావు అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. నల్లకుంటకు చెందిన నారాల విజయ్ కృష్ణ చైనాకు చెందిన కొందరితో కలిసి మోసాలు చేస్తున్నారు. వారి వద్ద ఉన్న బ్యాంక్ ఖాతా దారుల వివరాలు తీసుకుని మోసం చేస్తున్నారు.ఈ క్రమంలోనే బాధితురాలి ఫోన్ నంబర్‌కు లింక్ పంపించారు. ఇంటి వద్ద కూర్చుని డబ్బులు సంపాదించవచ్చని అందులో ఉంది.

వీరు పంపించిన లింక్‌ను ఓపెన్ చేసిన బాధితురాలు టెలిగ్రాం నుంచి రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌కు వెళ్లింది. అందులో బాధితురాలు పే, రీచార్జ్ ఫ్లికార్ట్, అమేజాన్ తదితర వివరాలు నమోదు చేశారు. తర్వాత రీఛార్జ్ చేయడంతో కొంత కమీషన్ వచ్చింది. వాటిని వెబ్‌సైట్ నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించడంతో వీలుకాలేదు. దీంతో బాధితురాలు నిందితులతో ఫోన్‌లో మాట్లాడడంతో మరికొంత డబ్బులతో రీఛార్జ్ చేస్తే మొత్తం డబ్బులు డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఇది నమ్మిన బాధితురాలు రూ.2.5లక్షలు రీఛార్జ్ చేసింది. తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు నగర సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇద్దరు నిందితులు చైనాకు చెందిన నిందితులను వాట్సాప్, మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. వారు చెప్పినట్లు నకిలీ కంపెనీల పేరుతో బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. వాటిలో ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో డబ్బులు డిపాజిట్ చేసిన డబ్బులను చైనాకు చెందిన వారు తీసుకుంటున్నారు. నగరానికి చెందిన ఇద్దరు నిందితులకు కమీషన్ ఇస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లు కావడంతో బాధితులు డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం వీలు కావడంలేదు. దీంతో మరింత డబ్బులు డిపాజిట్ చేస్తే విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పడంతో బాధితులు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసి మోసపోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News