Saturday, April 27, 2024

ఐటిబిపిలో మొదటిసారి ఇద్దరు మహిళా అధికారుల నియామకం

- Advertisement -
- Advertisement -

Appointment of two Women officers for first time in ITBP

 

ముస్సోరి: ఇండోటిబెటన్ బార్డర్ పోలీస్(ఐటిబిపి) దళాల్లో మొదటిసారి ఇద్దరు మహిళా అధికారులను నియమించారు. 50 వారాలపాటు శిక్షణ తీసుకున్న ప్రకృతి, దీక్షలను ఐటిబిపిలో అసిస్టెంట్ కమాండెంట్ అధికారులుగా నియమించారు. ముస్సోరీలోని శిక్షణా కేంద్రంలో ఆదివారం పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా వీరిద్దరికీ ర్యాంక్‌లు కేటాయించారు. వీరితోపాటు శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 53 మంది అధికారులు పాసింగ్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ధామీ, ఐటిబిపి డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎస్ దేశ్వాల్ హాజరయ్యారు. వీరంతా 2016లో యుపిఎస్‌సి నిర్వహించిన పరీక్షల ద్వారా ఎంపికయ్యారు. ఈ పరీక్షల నుంచే ఐటిబిపిలోకి మొదటిసారి మహిళలకు అవకాశం కల్పించారు. అంతకుముందు కానిస్టేబుల్‌స్థాయి ఉద్యోగాలకే మహిళలను పరిమితం చేశారు. ఐటిబిపి దళాలకు పర్వత ప్రాంతాల్లో పని చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

పరేడ్ సందర్భంగా ఐటిబిపి చారిత్రక నేపథ్యాన్ని తెలియజేసే ‘హిస్టరీ ఆఫ్ ఐటిబిపి’ పుస్తకాన్ని విడుదల చేశారు. 680 పేజీలున్న ఈ పుస్తకంలో అరుదైన 1000 ఫోటోలను పొందుపరిచారు. 1962లో చైనాతో యుద్ధం తర్వాత ఐటిబిపిని ఏర్పాటు చేశారు. చైనాతో ఉన్న 3488 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు(వాస్తవాధీనరేఖ(ఎల్‌ఎసి)) ఎక్కువభాగం పర్వతాలతో కూడుకున్నది. ఎల్‌ఎసిలోని కీలక ప్రాంతాల్లో ఐటిబిపి దళాలు విధులు నిర్వహిస్తాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత సంఘర్షణల్లోనూ ఐటిబిపి సేవల్ని వినియోగించుకుంటున్నారు. నక్సలైట్ల ఆపరేషన్ కోసం చత్తీస్‌గఢ్‌లాంటి చోట్ల కూడా వీరి సేవల్ని వినియోగించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News