Wednesday, May 8, 2024

70 అడుగుల లోతు బోరులో ఇరుక్కున్న కార్మికుడు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : పంజాబ్ లోని జలంధర్ జిల్లాలో 70 అడుగుల లోతు బోరులో ఇరుక్కున్న 55 ఏళ్ల కార్మికుడిని బయటకు తీయడానికి గత 15 గంటలుగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి జమ్ము లోని కట్‌రా వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జలంధర్ లోని కర్తార్ పుర్ సమీపంలో బస్రంపుర్ గ్రామంలో భారీ పిల్లర్ ఏర్పాటు చేస్తున్నారు.

దీని కోసం తవ్విన భారీ గుంతలో శనివారం రాత్రి బోరింగ్ యంత్రంలో సమస్య తలెత్తడంతో ఇద్దరు కార్మికులు అందులోకి దిగారు. ఆ తరువాత పవన్ అనే కార్మికుడు పైకి రాగా, సురేశ్ అనే కార్మికుడు 70 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. అతనిపై ఒక్కసారి ఇసుకపడడంతోబయటకు రాలేక పోయాడు.

సురేశ్ హర్యానా లోని జింద్ ప్రాంతానికి చెందిన వాడు. జిల్లా యంత్రాంగం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కలిసి సురేశ్‌ను రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని అధికారులు తెలిపారు. పోలీస్‌లు, ఆరోగ్య విభాగం అధికారులు అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రమంత్రి బల్కర్ సింగ్ శనివారం రాత్రి ఆ స్థలాన్ని సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News