Sunday, April 28, 2024

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కట్టడం అక్షరధామ్ ఆలయం

- Advertisement -
- Advertisement -

న్యూజెర్సీ : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో ఆరంభమైంది. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే ప్రాంతంలో ఈ అక్షరధామ్ శ్రేణి హిందూ ఆలయం సువిశాలమైన రీతిలో 185 ఎకరాలలో విస్తరించుకుంది. నేలమట్టానికి 191 అడుగుల ఎత్తున వెలిసింది. ఈ నెల 8వ తేదీన ఈ ఆలయాన్ని మహంతి స్వామి మహారాజు వేలాది మంది భక్తులు హాజరుకాగా దర్శనానికి ఆవిష్కరించారు. బొచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ (బిఎపిఎస్) సంస్థ ధార్మిక నేతగా మహంతి వ్యవహరిస్తున్నారు.

ఉత్తర అమెరికాలో ఇప్పుడు వెలిసిన ఈ దేవాలయం అందరిని ఎటువంటి భేదభావాలు లేకుండా అలరిస్తుందని మహంత్ స్వామి మహారాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి డెలావారే గవర్నర్ జాన్ కెర్నీ, సెనెటర్ స్టెనీ హోయర్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచంలోనే అతి రెండో అతి పెద్ద ఆలయం అని , పశ్చిమ దేశాలలో అతి పెద్దదని వివరించారు. ఈ పవిత్ర స్థలిని ఇప్పుడు సమాజానికి, మానవతకు అంకితం చేస్తున్నామని ప్రకటించారు. ప్రజలలో విలువలు, ధర్మాచరణ, జ్ఞాన సముపార్జన, భక్తి , ఆధ్మాత్మిక భావనలు పెంపొందింపచేసేందుకు , సంపూర్ణ రీతిలో ఏకాంతిక్ ధర్మం స్థాపించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News