- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ముసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చౌటుప్పల్ మండలంలో ఈదుల వాగు పొంగి ప్రవహించడంతో కారు కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి ఏడుగురిని స్థానికులు కాపాడారు. కారు ఈదుల వాగు నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా వరదలో కొట్టుకపోయింది. స్థానికులు తాడు వేసి ఏడుగురిని బయటకు లాగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంగం భీమలింగం దగ్గర మూసీ లెవెల్ వంతెన పైనుంచి ప్రవహిస్తుంది. మూసీ నది వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిస్థాయికి పెరగడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రజలకు అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
- Advertisement -