Tuesday, April 30, 2024

తన తప్పు లేదన్న వినని పోలీసులు..యువకుని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పాలకవీడు: షేక్ నాగుల్ మీరా అనే యువకుడు ఉనివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 31 అర్ధరాత్రి పాలకవీడు మండల కేంద్రంలో రోడ్డుపై వస్తుండగా పగడాల జ్యోతిబసుకు గాయాలై అపస్మారక స్థిలో ఉండగా స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికులు గాయపడిన జ్యోతిబసును చికిత్సం నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జ్యోతిబసుకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు నాగుల్‌మీరా అనే యువకుని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు తీసుకెళ్ళారు. అయితే నాగుల్ మీరా ఎలాంటి తప్పు చేయలేదని కుటుంబ సభ్యులు చెప్పిన పోలీసులు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తన బైక్ ను తీసుకెళ్లడంతో మనస్థాపానికి గురైన నాగుల్ మీరా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నా కొడుకు నాగుల్‌మీరా ద్విచక్ర వాహనం నడపలేదని తనపై అక్రమంగా కేసు బనాయిస్తారేమోనన్న భయంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని నాగుల్‌మీరా కుటుంబ సభ్యులు పాలకవీడు పోలీస్ స్టేషన్ ముందు జాన్‌పహాడ్ నేరెడుచర్ల రహదారిపై 3గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

వారికి ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో విషయం తెలుసుకున్న కొదాడ డియస్‌పి వెంకటేశ్వరరెడ్డి,హుజూర్‌నగర్ సిఐ రామలింగారెడ్డి, గరిడేపల్లి,నేరెడుచర్ల, మఠంపల్లి, మేళ్ళచెరువు, చింతలపాలెం యస్‌ఐల ఆద్వర్యంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్లు డిఎస్పి వెంకటేశ్వరరెడ్డి ,సిఐ రామలింగారెడ్డిలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News