Thursday, May 2, 2024

యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్

- Advertisement -
- Advertisement -

Young Man Commits Suicide in Vanasthalipuram

హైదరాబాద్: ఆన్‌లైన్‌ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసిన విషాద ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. ఆన్ లైన్ గేమ్ తో అప్పులపాలైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… వనస్థలిపురానికి చెందిన జగదీశ్‌ (33) అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసైయ్యాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అప్పుల పాలయ్యాడు. గతంలో అప్పులు చేసిన రూ.12లక్షలు తీర్చాడు. మిగిలిన అప్పు తీర్చేందుకు మరోసారి ఆన్ లైన్ గేమ్ ఆడి నష్టపోయాడు. దీంతో మనస్తాపం చెందిన జగదీశ్ బలవన్మరానికి పాల్పడ్డాడు. జగదీశ్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి తనను క్షమించమని భార్యకు పంపాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Young Man Commits Suicide in Vanasthalipuram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News