Sunday, April 28, 2024

నగరానికి ఎంతో చేశాం.. ఇంకా చేయాల్సిఉంది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Fires on Central Government

హైదరాబాద్: ప్రధాని మోడీ ప్రభుత్వంపై మంత్రి కెటిఆర్ విమర్శలు గుప్పించారు. జన్ ధన్ ఖాతాల్లో ప్రధాని రూ. 15లక్షలు వేస్తామన్నారు… ఎవరి ఖాతాలోనైనా రూ.15లక్షలు వేశారా..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ కింద రూ. 20లక్షల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు.. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో ఎవరికైనా ఒక్కరూపాయి లబ్ధి జరిగిందా.? అని మంత్రి ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామని ఊదరగొట్టారని గుర్తుచేశారు.

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో కొంతమంది పిచ్చిపిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్ అంటే.. మరొకరు సమాధులు కూలుస్తామంటున్నారు. కొత్త ఉద్యోగాలు రావడం కాదు ఉన్న ఉద్యోగాలు పోయాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఎయిరిండియా, ఎల్ఐసిని అమ్మేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి ఎంతో చేశాం.. ఇంకా చేయాల్సిఉంది చాలా ఉందని వివరించారు. హైదరాబాద్ లో కర్ఫ్యూలు, కల్లోలాలు వద్దు.. ప్రశాంత కావాలన్నారు. మత పిచ్చి లేపి మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని జాగ్రత్త ఉండాలని సూచించారు. ఎవరి నాయకత్వం ఉంటే లాభం జరుగుతుందో ఆలోచించి, పనిమంతులను ఓటు ద్వారా ఆశీర్వదించాలని మంత్రి కెటిఆర్ కోరారు.

Minister KTR Fires on Central Government

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News