Thursday, February 9, 2023

ప్రేమించిన యువతి మాట్లాడటం లేదని..

- Advertisement -

మనతెలంగాణ /అర్వపల్లి : గత నాలుగు సంవత్సరాలుగా ఒకరిని ఒకరు ప్రేమించుకుని ఇటీవల మనస్పర్థలు రావడంతో ప్రేమించిన యువతి మాట్లాడటం లేదని పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబీకులు ఎస్‌ఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోనేటి మహేష్( 23) గత నాలుగు సంవత్సరాలుగా జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన యువతి మహేష్‌లు ప్రేమించుకుంటున్నారు.

గత కొంతకాలంగా మాట్లాడకపోవడంతో శుక్రవారం అమ్మాయివాళ్ల ఊరు అయిన కొమ్మాల గ్రామానికి వచ్చి యువతితో మాట్లాడటానికి ప్రయత్రించగా అమ్మాయి నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందును మహేష్ అమ్మాయి కళ్లముందే తాగాడు. వెంటనే గ్రామస్థులు మహేష్‌ను చికిత్సనిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి కోనేటి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంజిరెడ్డి తెలిపారు. ఇట్టి మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles