Saturday, October 5, 2024

తండ్రి మరణం తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమార్తె శనివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండలంలో చోటుచేసుకుంది. గుండెల మీద పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచిన తండ్రి చనిపోవడంతో గత రెండేళ్లుగా ఆమె తీవ్ర మనస్థాపానికి గురవుతోంది. తండ్రి లేని ఈ లోకంలో తాను కూడా బతకలేనని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దశరథం భీమమ్మ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు.

ఆయనకు కుమార్తె అఖిల (21), కుమారుడు ఉన్నారు. రెండేళ్ల కిత్రం తండ్రి అనారోగ్య సమస్యలతో మరణించాడు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రిని తలుచుకుంటూ గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి చనిపోఓయినప్పటి నుంచి ఆమె తండ్రి పేరును జపిస్తూ ..తలుచుకుంటూ దు:ఖించేదని ఇంటి చుట్టుపక్కలవారు, తోటి స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News