Thursday, August 7, 2025

చెప్పినట్లు వినకపోతే ఇంకా పెంచుతాం.. భారత్ కు ట్రంప్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: భారత్ కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే..అదనపు సుంకాలను ఇంకా భారీగా పెంచుతామని ట్రంప్ తాజాగా హెచ్చరించాడు. నిన్న భారత దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధించాడు. దీంతో భారత్ పై మొత్తం సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ఈ సుంకాలు పెంచిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ మరోసారి సుంకాలను ప్రకటన చేశాడు. రష్యా నుంచి చమురు వాణిజ్యాన్ని కొనసాగించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారత్ పై త్వరలో మరిన్ని ద్వితీయ ఆంక్షలు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశాడు. ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత రష్యాతో ఆర్థిక సంబంధాలను తగ్గించుకోవాలని లేదా తెంచుకోవాలని పలు దేశాలపై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమంలోనే భారత్ పై భారీగా సుంకాలను పెంచుతున్నట్లు ట్రంప్ చెబుతున్నాడు.

చైనా వంటి దేశాలు కూడా రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నాయని.. కానీ, భారత్ పైనే అదనపు ఆంక్షలకు ఎందుకు విధిస్తున్నారని వైట్ హౌస్‌లో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇస్తూ.. “ఇది ఎనిమిది గంటలు మాత్రమే. కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం. మీరు ఇంకా చాలా చూడబోతున్నారు. మీరు చాలా ద్వితీయ ఆంక్షలను చూడబోతున్నారు” అని అన్నారు.

కాగా, భారత్ 88 శాతం ముడి చమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు, భారత్ రష్యా నుండి మొత్తం ముడి చమురులో కేవలం 0.2 శాతం మాత్రమే కొనుగోలు చేసేది. అయితే, రష్యా ఇప్పుడు భారత్ కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. జూలైలో భారత్, రష్యా నుండి రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News