Wednesday, May 1, 2024

సందర్శకులను కట్టిపడేస్తున్న జూపార్కు

- Advertisement -
- Advertisement -

2022 సంవత్సరంలో జూను సందర్శించిన 2.5 మిలియన్ల మంది
డిసెంబర్ 27 రోజుల్లో 3.02 లక్షల సందర్శకుల రాక

మన తెలంగాణ/రాజేంద్రనగర్: 2022 ఆంగ్ల సంవత్సరం ఆదివారంతో ముగియటంతో రెండున్నర మిలియన్ల సందర్శకులు నగర జంతు ప్రదర్శన శాలను తిలకించేలా చేసింది. 2022 జనవరి మాసం నుంచి కాలమానంలో మారిన పేజీ డిసెంబర్ 31వ తేదీ వరకు అక్షరాల ఇరవై ఐదు లక్షలమంది నగరంతో పాటు రాష్ట్ర నలుమూలలు, వివిధ రాష్ట్రాల నుంచి నెహ్రూ జూలాజికల్‌పార్కు సందర్శనకు తరలివచ్చారు.

దీంతో 201920, 202021 సంవత్సరాలతో పోల్చితే సందర్శకుల సంఖ్య పరంగా కొత్త రికార్డును నగర జూపార్కు సృష్టించింది. లాక్‌డౌన్ సమయంలో చాలాకాలం మూసుకున్న జూ గేట్లది ఒక చరిత్రగానే నిలిపిపోయింది. ఇక సాధారణ జనజీవనం కొనసాగుతున్న తరుణంలో తన పూ ర్వపు వైభవాన్ని తిరిగి ఇముడింపజేసుకుంటుంటుంది నెహ్రూ జూపార్కు. నిత్యంవేలాదిగా తరలి వస్తున్న సందర్శకుల సంఖ్యతోపాటు జంతు విజ్ఞాన కేంద్రంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్టడీటూర్‌కు కేరాఫ్‌గా మారుతోంది. ఒక రోజు దాదాపు 100పైగా పాఠశాలల నుంచి విజ్ఞాన యాత్రకు ఈజంతు ప్రదర్శన శాలకు విద్యార్థినీ, విద్యార్థులు తరలి వచ్చారంటే వైల్డ్‌లైఫ్ ప్రా ముఖ్యతను కళ్ల ముందుంచడంతో నెహ్రూ జూ పోషిస్తున్న పాత్రను తెలియజేస్తోంది.

విద్యార్థుల కేరింతలు..వన్యప్రాణుల పలకరింపులు

జూపార్కుకు తరలివస్తున్న విద్యార్థులను వన్యప్రాణులు తమదైన శైలిలో పలకరిస్తున్నాయి. మూ గ బాషలో అవి చేసే చప్పుళ్లు భావిభారత పౌరులను జంతు విజ్ఞానంపై మమకారం పెంచేలా చేస్తున్నాయి. ఇక్కడి 150 ఏళ్ల గలపగాస్ దీవుల తాబేళ్లు, వన జాతిలో అతి చిన్నవైన మర్మోసెట్లు, గాలిలో విహరించే సీతాకోకచిలుకల సందడి అంతాఇంతా కాదనే చె ప్పాలి. ఇక పెద్ద పులుల గాండ్రిపులు, ఏనుగుల ఘీంకారనాథాలు, చీతాల పరుగులు ఇలా ఒక్కటేమిటి జూలో అడుగడు వన్యప్రాణి ప్రపంచమే. పొడవాటి మె డ, డబ్బాల శరీర ఆకృతి కలిగిన జిరాఫీల సొగసులు వి ద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

సబ్‌సే అచ్చా ఇదరీ హై…

వివిధ రాష్ట్రాల నుంచి జూపార్కును తిలకించేందుకు తరలివస్తున్న సందర్శకులు సబ్‌సే అచ్చా ఇ దరీ హై అంటున్నారు. పచ్చని పచ్చిక బయళ్లు, భారీ వృక్షాలు నిజారాణ్య అనుభూతిని ఇస్తున్నాయని వారన్నారు. నడిచే వారికి ఫుట్‌పాతులు, నడవలేని వారికి బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉండడం చాలా సంతోషకరంగా ఉందని పలువురు మహారాష్ట్ర, కర్నాట క, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెం దిన పలువురు సందర్శకులను మన తెలంగాణ పలుకరించగా చెప్పారు. ఇదర్ కా ‘చుడియా ఘర్’ బొహత్ ప సంద్ ఆరా హై అంటు ఢిల్లీకి చెందిన కొందరు సందర్శకులు తెలిపారు. గాజు నివాసాల్లో ఒకే చోట్ల అనేక రకాల పక్షులను తిలకించడం మాకు సంతోషం కలిగించిందని వారి భావన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News