Wednesday, September 24, 2025

రిఫైండ్ చక్కెర లేని మిల్క్ షేక్స్ ను విడుదల చేసిన ZUMI

- Advertisement -
- Advertisement -

బీనెరి ఫుడ్స్, హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ లాక్టోజ్ రహితమైన, రిఫైండ్ చక్కెర లేని, పరిశుభ్రమైన మిల్క్ షేక్స్ ను విడుదల చేసింది. లాక్టోజ్ ను తట్టుకోలేని వారు, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారి కోసం రూపొందించబడ్డాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగిన భారతీయులు స్మార్ట్ గా ఉండే ఆహార పదార్థాలను కోరుతోంది. ‘జుమి‘ బ్రాండ్ పేరుతో విడుదల చేయబడిన, ఈ సహజంగా మీగడ ఉండిమరియు తియ్యని లాక్టోజ్ రహితమైన సూత్రీకరణ పేగుల్లో సున్నితంగా పని చేస్తుంది మరియు మాంక్ పండు మరియు బెల్లంతో తియ్యదనం కలిగించి, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని చేసింది. ఈ ఉత్పత్తి ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ మరియు చెన్నైలలో www.zumifoods.com మరియు ద్వారా లభిస్తోంది మరియు క్విక్ కామర్స్ ప్లాట్ ఫాంలలో త్వరలోనే లభిస్తుంది.

ZUMI స్టార్టప్ ఇండియా భాగస్వామ్యంతో టెట్రా ప్యాక్ ఇండియా ద్వారా స్టార్టప్ ఛాలెంజ్ 2024 విజేతల్లో ఒకటిగా ఉంది. ఈ కార్యక్రమం భారతదేశపు F&B వ్యవస్థలో ఆవిష్కరణను ప్రోత్సహించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా, జుమి ఉత్పత్తి అభివృద్ధి, మార్గదర్శకత్వం మరియు వాణిజ్యీకరణలో సమగ్రమైన మద్దతును అందుకుంది మరియు ఉత్పత్తి సూత్రీకరణ మరియు పరీక్షలో ప్రత్యక్షమైన సహాయం కోసం చకన్ లో టెట్రా ప్యాక్ ఉత్పత్తి అభివృద్ధి కేంద్రానికి యాక్సెస్ ను కూడా పొందింది.

రోజ్ కుల్ఫి, రస్ మలై, చాకొలెట్ సహా భారతదేశపు డిజర్ట్స్ తో ప్రేరేపించబడిన మూడు మూడు రుచుల్లో మిల్క్ షేక్స్ లభిస్తున్నాయి- దేశవ్యాప్తంగా విభిన్నమైన రుచులకు సేవలు అందిస్తోంది. సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన, తాగడానికి సిద్ధంగా ఉండే టెట్రా ప్యాక్ ప్యాకేజింగ్ లో లభిస్తున్న జుమీ మిల్క్ షేక్స్ నేటి ప్రయాణించే వినియోగదారు కోసం రూపొందించబడింది,ప్రతి 200 మి.లీ ప్యాకేజీ 6-7 గ్రా ప్రోటీన్ ను అందిస్తుంది.

ప్రతి ఒక్కరి కోసం లాక్టోజ్-రహితమైన సూత్రీకరణ

లాక్టోజ్ రహితమైన పాలు సాధారణ పాల వంటి అదే సమృద్ధియైన పోషకాలను అందిస్తాయి మరియు అవి సులభంగా జీర్ణమవుతాయి. ఇది ఫిట్ నెస్ పట్ల ఆసక్తి గల వారికి, పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న ప్రజలకు, జీర్ణశక్తి బలహీనంగా ఉన్న వారికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకున్న వినియోగదారులకు ఇది రోజూ తాగడానికి ఒక తెలివైన ఎంపికను చేసింది. పాలు భారతదేశంలో నిత్యం తీసుకునే ఆహారం మరియు సుమారు 30% వినియోగదారులకు లాక్టోజ్ తో అనుకూలత లేదని గుర్తించబడింది అయితే వాస్తవంగా 70% మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ విభిన్నమైన ఆహారపు అవసరాలు తీర్చడానికి జుమీ ఉత్పత్తులు తయారు చేయబడ్డాయి, రోజూవారీ ఆహారాలను ఆరోగ్యంగా మరియు రుచి లేదా అనుభవాలలో రాజీ లేని ఎంపికలుగా మార్చాయి.

సహజంగా తియ్యనిది, అపరాధ భావన లేకుండా మిఠాయి అవసరాలు తీరుస్తుంది

లాక్టాజ్ (సహజంగా సంభవించే ఎంజైమ్)ను చేర్చడం ద్వారా లాక్టోజ్ రహితమైన పాలు తయారవుతాయి, ఇది లాక్టోజ్ ను సాధారణ చక్కెరలుగా (గ్లూకోజ్ మరియు గాలాక్టోజ్) ముక్కలు చేస్తుంది, సాధారణ పాలు కంటే సహజమైన తియ్యనిదిగా చేస్తుంది. లాక్టోజ్ రహితమైన పాలను సహజమైన జీరో GI స్వీట్నెర్స్ అయిన మాంక్ పడు వంటివి జుమీ మిల్క్ షేక్స్ కు సమృద్ధియైన మీగడ రుచిని ఇస్తాయి మరియు ఇవి కాలరీలు అధికంగా ఉన్న మిఠాయిలకు ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా చేసాయి. ప్యాక్ నుండి నేరుగా అందచేసినప్పుడు లేదా, ఆరోగ్యకరమైన డిజర్ట్ వంటకాలకు మరియు స్మూతీస్ కు ప్రాథమికంగా చేర్చినప్పుడు పరిపూర్ణంగా ఉంటాయి జుమీ షేక్స్ సౌకర్యం, పోషకాలు మరియ రుచులు అందిస్తాయి.

ఈ విడుదల గురించి మాట్లాడుతూ, తపస్య విజయరాఘవన్, ఫౌండర్, జుమీ ఫుడ్స్, ఇలా అన్నారు: “మా శుభ్రమైన, లాక్టోజ్ – రహితమైన, రిఫైండ్ చక్కెర లేని మిల్క్ షేక్స్ తో మరియు భారతదేశం ఏ విధంగా స్నాక్స్ పొందుతుంది మరియు ఆస్వాదిస్తుందో పునర్నిర్వచించడం ద్వారా ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉండే భారతదేశపు వినియోగదారులకు సేవలు అందించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. మీకు మెరుగైన ఆహారాన్ని అందరికీ ఆనందకరంగా, అపరాధ భావన లేని ఎంపికగా మార్చడం, పోషకాహారాన్ని అసాధారణమైన రుచితో మిశ్రమం చేయడమే ZUMIలో మా కల. లాక్టోజ్ రహితమైన పాలు సాధారణ పాల యొక్క పోషకాలు అన్నింటినీ నిలిపి ఉంచుతుంది మరియు పేగులపై సున్నితంగా పని చేస్తుంది మరియు సహజంగా తియ్యనిది మరియు లాక్టోజ్ సహనశీలత లేని వారికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఎంపిక. టెట్రా ప్యాక్ మరియు స్టార్టప్ ఇండియా వారి అసాధారణమైన మద్దతు మరియు మార్గదర్శకత్వంతో, భారతదేశంలో మా కలను వాస్తవికతను పునర్నిర్వచించే ఆనందంగా మార్చుకున్నాము-ఇక్కడ రుచి ఆరోగ్యాన్ని కలుస్తుంది, రాజీపడదు.

కస్సియో సిమోస్, MD, టెట్రా ప్యాక్ దక్షిణాసియా, ఇలా అన్నారు: ”టెట్రా ప్యాక్ లో, భారతదేశ ఆహార మరియు పానియాల వ్యవస్థను పెంపొందించడం అనేది పరిశ్రమ నాయకునిగా మేము మా బాధ్యతగా భావిస్తున్నాం. జుమీ భారతదేశపు పానియాల రంగానికి ఒక పునరుత్తేజం కలిగించే కోణాన్ని తెచ్చింది, కార్యాచరణను మరియు రుచితో కలిపింది, మరియు మా స్టార్టప్ సవాలు ద్వారా భావన నుండి షెల్ప్ కి వారి ప్రయాణాన్ని మద్దతు చేయడానికి ఆనందించాము – మా అంతర్జాతీయ నైపుణ్యం, మౌళిక సదుపాయాలు, మార్గదర్శకత్వం పొందడానికి అవకాశం కల్పించాము. విజయవంతమైన ఔత్సాహికులతో మేము సహకారం కొనసాగిస్తుండటం వలన, వినియోగదారులు, స్టార్టప్స్ మరియు పరిశ్రమకు ప్రయోజనాలు కలిగించే శక్తివంతమైన, మరియు సుస్థిరమైన F&B వ్యవస్థను రూపొందించడమే మా లక్ష్యం.”

సంజీవ్ సింగ్, జాయింట్ సెక్రటరీ, డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT), స్టార్టప్ ఇండియా ఇలా అన్నారు.. “భారతదేశపు స్టార్టప్ వ్యవస్థ ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న వాటిలో ఒకటిగా మారింది, 770+ జిల్లాలకు పైగా (ఆగస్ట్ 2025 నాటికి) 180,000+ గుర్తించబడిన స్టార్టప్స్ ను కలిగి ఉంది. వాటిలో సుమారు 52% టియర్ 2 మరియు 3 నగరాలకు చెందినవి.

అందువలన దేశీయంగా అభివృద్ధి చెందిన స్టార్టప్స్ స్థానిక అభిప్రాయాలతో అంతర్జాతీయంగా ఉత్తమమైన పద్ధతులను కలపడానికి విలక్షణమైన స్థానంలో ఉన్యి, ఆధునిక భారతీయులతో అనుగుణంగా ఉండే ఉత్పత్తులను సృష్టిస్తున్నాయి. భారతదేశపు ప్రతిష్ట ఆహారం & పానీయాల ఆవిష్కరణ కోసం వేదిగా చేసాయి. టెట్రా ప్యాక్ వారి స్టార్టప్- సవాలు వంటి కార్యక్రమాలను మద్దతు చేయడానికి మేము గర్విస్తున్నాం. ఈ స్టార్టప్స్ ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందగల, అర్థవంతమైన ఉపాధిని సృష్టించి. భారతదేశం దాని ఆవిష్కరణ దృశ్యం నుండి మరింత ఎక్కువ విలువను గ్రహించడంలో సహాయపడే వ్యవస్థను పెంపొందించడానికి కట్టుబడి ఉంటాము.”

తమ రిఫైండ్ లేని చక్కెర, లాక్టోజ్ రహితమైన మిల్క్ షేక్స్ విడుదలతో, జుమీ ఫుడ్స్ భారతదేశంలో ఆరోగ్యకరమైన ఆహారాల కోసం ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది. రాబోయే సంవత్సరంలో, బ్రాండ్ మరిన్ని నగరాలకు విస్తరించడానికి, కొత్త రుచుల్ని పరిచయం చేయడానికి, పేపర్ –ఆధారిత టెట్రా ప్యాక్ ప్యాకేజింగ్ ను ప్రవేశపెట్టడానికి లక్ష్యాన్ని కలిగి ఉంది – క్రియాత్మకమైన, పరిశుభ్రమైన-లేబుల్ గల పానియాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే దాని లక్ష్యాన్ని కొనసాగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News