Sunday, April 28, 2024

కేంద్ర వ్యవసాయ చట్టాలను పంజాబ్ ప్రభుత్వం మార్చలేదు : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Punjab government has not changed central Agricultural laws: Kejriwal

 

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్ రాష్ట్రప్రభుత్వం మార్చలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాల ద్వారా రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర వ్యవసాయ నూతన చట్టాలను తిరస్కరిస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నాయకత్వంలో మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఐదు గంటల పాటు చర్చించి తీర్మానాలు చేసింది. దీనికి కేజ్రీవాల్ స్పందిస్తూ ఇదో పెద్దడ్రామాగా వ్యాఖ్యానించారు. రాజా సాహెబ్ మీరు కేంద్ర చట్టాలను సవరిస్తూ తీర్మానించారు. కానీ కేంద్ర చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించ గలదా ? మీ డ్రామాతో ప్రజలను ఫూల్ చేస్తున్నారు అని కేజ్రీవాల్ విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News