Friday, April 26, 2024

మర మగ్గాల నుండే మోడీకి ఉత్తరం..

- Advertisement -
- Advertisement -

10 thousand postcards for PM Modi across Siddipet

సిద్దిపేట: చేనేత వస్త్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన జిఎస్టీని వెంటనే ఎత్తివేయాలని ప్రధాని మోడీకి లక్ష పోస్ట్ కార్డ్ ల పంపడంపై టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో మంత్రి హరీష్ రావు సూచనతో జిల్లా వ్యాప్తంగా నేతన్నలు కదం తొక్కారు. జిల్లావ్యాప్తంగా 10 వేల ఉత్తరాలు మోడీకి వ్రాస్తు జిఎస్టీ ని ఎత్తివేయాలని నినదించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని పలు సొసైటీలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు. చేనేత ఒక వ్యాపారం కాదని, దేశ వారసత్వ కళా సంపద అని సిద్దిపేట చేనేత పారిశ్రామిక సంఘం రాష్ట్ర నాయకులు బూర మల్లేశం, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చిప్ప ప్రభాకర్ అన్నారు.

భారతదేశానికి వన్నె తెచ్చిన చేనేత రంగంపై, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేయడం బిజెపి ప్రభుత్వానికి తగదు అన్నారు. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో చేనేత కార్మికులు 10000 పోస్ట్ కార్డులను ప్రధాని నరేంద్ర మోడీకి పోస్టు ద్వారా పంపించే కార్యక్రమం చేపట్టారు. చేనేత కళాకారులు అందరి సంతకాలతో కూడిన ఈ లెటర్లను వారం రోజుల్లో పోస్ట్ చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట గొల్లభామ చేనేత మగ్గం ప్లాంట్లు లో పనిచేస్తున్న కార్మికులచే సంఘం నాయకులు సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతకు వాడే ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై జిఎస్టి వేయడం ద్వారా కార్మికుల పాలిట శాపంగా మారిందన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి చేనేత మూడు సరుకులపై చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను లేదని తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ ని రద్దు చేయాలని…. లేనిపక్షంలో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తొందరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంగం నాయకులు లోక లక్ష్మీరాజ్యం,తుమ్మ గాలయ్య, ముదిగొండ శ్రీనివాస్, నరసింహ పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News