Sunday, May 5, 2024

‘కళావతి…’ కొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

100 million views‌ to Kalavathi song

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి…’ పాట కొత్త రికార్డును సృష్టించింది. ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచి శ్రోతల హృదయాలను దోచుకుంటూనే ఉంది. ఈ బ్లాక్ బస్టర్ పాట ఇప్పటివరకు 1.7 మిలియన్ లైక్ లతో 100 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. శరవేగంగా మహేష్‌బాబు కెరీర్‌లోనే కొత్త మైలురాయిని చేరుకున్న మొదటి సింగిల్‌గా ఈ పాట నిలవడం విశేషం. ఈ పాటకు తమన్ అద్భుతమైన బాణీలు సమకూర్చగా సిద్ శ్రీరామ్ తన మధురమైన గానంతో పాటకు ప్రాణం పోశాడు. అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం సమకూర్చాడు.

మహేష్ బాబు తన స్టైలిష్ లుక్స్, ఆకట్టుకునే హావభావాలతో అందరినీ అలరించాడు. కీర్తి సురేష్ ఇందులో చాలా అందంగా కనిపించింది. ఈ చిత్రం నుంచి వచ్చిన రెండవ సింగిల్ ‘పెన్నీ’ కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. మహేష్ కూతురు సితార ఘట్టమనేని స్టెప్పులు వేసిన ఈ పాట వైరల్‌గా మారింది. తమన్ ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ అందించాడు. రెండు పాటలు విజయం సాధించడంతో ప్రేక్షకుల్లో సినిమా తదుపరి పాటలపై ఆసక్తి పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News