Thursday, May 2, 2024

తెలంగాణలో మరో 1,196 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

1196 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,196 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. అదేసమయంలో 1,745 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,53,651కి చేరింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 2,34,234 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 18,027 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,390 మంది ప్రాణాలు కోల్పోయారు. 15,205 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 192, రంగారెడ్డిలో 121 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

1196 New Covid-19 Cases Reported in Telangana

1196 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News