Sunday, April 28, 2024

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR to launch Command Control & Data Centre

హైదరాబాద్: యావత్ దేశం హైదరాబాద్, తెలంగాణ వైపు చూస్తోందని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ లో పరిధిలోని క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను హోంమంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీతో క‌లిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సిపి సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ”హైదరాబాద్ లో క్రైమ్ చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. గతంలో ఏదో గొడవతో ఏడాదికోసారి కర్ఫ్యూ ఉండేది. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క కర్ఫ్యూలేదు, గొడవలు లేవు. గడిచిన ఆరేళ్లలో శాంతిభద్రతల పర్యవేక్షణలో టి- పోలీస్ విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.280కోట్లతో పోలీస్ శాఖకు కొత్త వాహనాలు కేటాయించింది. ప్రపంచ పోలీస్ టెక్నాలజీతో సమానంగా బంజారాహిల్స్‌లో అధునాత‌న టెక్నాల‌జీతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వచ్చే రెండు నెలల్లో రాబోతోంది” అని ఆయన తెలిపారు.

”దేశంలో ఉన్న మొత్తం సిసి కెమెరాల్లో 65 శాతం కెమెరాలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. హైదరాబాద్ లో 5లక్షలకు పైగా సిసిటివి కెమెరాలు ఉన్నాయి. నేరం చేసిన గంటల వ్యవధిలోనే నేరస్తులు దొరికిపోతారు. నగరంలో ఎమర్జెన్సీ అంబులెన్స్ లు ఆస్పత్రులకు వేగంగా వెళ్లేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ చేయాలని మంత్రి కెటిఆర్ కోరారు. మహిళల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. మహిళ రక్షణ కోసం మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. మహిళ రక్షణ కోసం డ్రోన్ పోలీసింగ్ అమలు కోసం ఏవియేషన్ అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్ పై తెలంగాణ పోలీస్ శాఖ దృష్టి పెట్టి అరికట్టాలి” అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

Minister KTR to launch Command Control & Data Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News