Sunday, April 28, 2024

సభ్యుల సస్పెన్షన్ న్యాయమే

- Advertisement -
- Advertisement -

సభ్యుల సస్పెన్షన్ న్యాయమే
వారు క్షమాపణ చెబితే తప్ప ఎత్తివేయడం కుదరదు
విపక్ష నేత ఖర్గే అభ్యర్థనను తిరస్కరించిన చైర్మన్ వెంకయ్య
రాజ్యసభలో విపక్షాల వాకౌట్

12 Members suspended in Rajya Sabha

న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన అభ్యర్థనను చైర్మన్ వెంకయ్య నాయుడు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు మంగళవారం సభనుంచి వాకౌట్ చేశారు. ‘12 మంది సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఆ తీర్మానాన్ని ఆమోదించడం, చర్య తీసుకోవడం జరిగిపోయిందని, అదే ఫైనల్ అని సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ మల్లికారున ఖర్గే చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. గత సమావేశాల్లో సభ్యులు విధ్వసం సృష్టించారని, వారిని సస్పెండ్ చేయడం న్యాయమేనని ఆయన స్పష్టం చేశారు. చెయిర్‌కు క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ వేటును వెనక్కి తీసుకుంటామని వెంకయ్య స్పష్టం చేశారు. అయితే సస్పెండయిన ఎంపిలు తాము చేసిన పనికి ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు సరికదా, తమ చర్యను సమర్థించుకున్నారని ఆయన అంటూ, అందువల్ల ఖర్గే అభ్యర్థనను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ సహా విపక్షాలకు చెందిన సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు కూడా వాకౌట్ చేశారు.
అంతకు ముందు సభ సమావేశం అయిన వెంటనే ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సోమవారం ప్రతిపాదించిన తీర్మానం నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని, ఎందుకంటే గత సమావేశాల్లో జరిగిన సంఘటనపై ఈ సమావేశాల్లో చర్య తీసుకున్నారని అన్నారు. అయితే ఖర్గే వాదనను వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు. రాజ్యసభ నిరంతర వ్యవస్థ అని ఆయన అంటూ, దురుసుగా ప్రవర్తించిన సభ్యులను సస్పెండ్ చేసే అధికారం చైర్మన్‌కు ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, గత ఆగస్టు 10న సభలో సభ్యులు గొడవ సృష్టించినప్పుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ అనేక సార్లు అపీల్ చేశారని, ఆ తర్వాత గొడవ చేసిన సభ్యులపేర్లను ప్రస్తావించడంతో పాటు రాజ్యసభ బులెటిన్‌లో కూడా వారి పేర్లను ప్రకటించడం జరిగిందని, సభ రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని నాయుడు అన్నారు. సోమవారం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి తనను అనుమతించలేదన్న ఖర్డే ఆరోపణపై ఆయన ఏమీ మాట్లాడలేదు. వెంకయ్య నాయుడి రూలింగ్‌పై సంతృప్తి చెందని కాంగ్రెస్, ఆప్, ఆర్‌జెడి, వామపక్షాల సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అయితే చైర్మన్ వారిని అనుమతించకుండా జీరో అవర్‌ను చేపట్టారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌ చేశారు.ఆ తర్వాత కొద్ది సేపటికి టిఎంసి సభ్యులు కూడా వాకౌట్ చేశారు.

12 Members suspended in Rajya Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News