Sunday, April 28, 2024

విమానయాన రంగంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

12000 flight cancellations over five days

వాషింగ్టన్: క్రిస్మస్ సెలవుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడం సాధారణం. అయితే ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ ఉంండం కారణంగా విమానయాన సంస్థలు సిబ్బంది కొరతను ఎదుర్కొంటూ ఉండడం , దానికి తోడు వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారంనుంచి ఇప్పటివరకు దాదాపు 12, 000( కచ్చితంగా చెప్పాలంటే 11,500) విమాన సర్వీసులు రద్దు కాగా, వేల సంఖ్యలో విమానాలు ఆలస్యం అయ్యాయి. విమాన సర్వీసులగురించి సమాచారం అందించే ఫ్లైట్ అవేర్ అనే సంస్థ అందించిన వివరాల ప్రకారం సోమవారం నాడు 3,000, మంగళవారం నాడు వెయ్యి విమాన సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం రద్దయిన విమాన సర్వీసుల్లో అమెరికాకు చెందిన స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 264 విమానాలు,అలాస్కా ఎయిర్‌లైన్స్ 141, యునైటెడ్ ఎయిర్‌లైన్స్93, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 84 విమాన సర్వీసులు ఉన్నాయి.

అంతేకాదు, క్రిస్మస్ ముందు రోజు, క్రిస్మస్, ఆ తర్వాతి రోజు మొత్తం మూడు రోజుల్లో 6 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు కూడా వార్తలు వచ్చాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, సిబ్బంది ఒమిక్రాన్ బారిన పడడం, క్వారైంటైన్ కారణంగా విమాన సరీసులును రద్దు చేయాల్సి వచ్చిందని స్కైవేస్ట్ ఎయిర్‌లైన్స్ తెలియజేస్తూ , అందుకు క్షమాపణలు కూడా చెప్పింది. వీలయినంత త్వరలో మామూలు సర్వీసులు నడపడానికి చర్యలు తీసుకొంటున్నామని ఒక ప్రకటనలో తెలియజేసింది. మిగతా ఎయిర్‌లైన్స్ కూడా ఇదే తరహా ప్రకటనలు విడుదల చేశాయి. మరోపక్క అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) కొవిడ్ రోగుల ఐసొలేషన్ సమయాన్ని తగ్గించింది.గతంలో పది రోజులుగా ఉన్న ఐసొలేషన్ సమయాన్ని 5 రోజులకు తగ్గించిది. ఒమిక్రాన్ వ్యాప్తి సమయంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News