Sunday, April 28, 2024

2లక్షల 30 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1273 new covid cases 5 deaths in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 30వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,274 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా శుక్రవారం 35,280 మందికి పరీక్షలు చేయగా 1273 పాజిటివ్‌లు తేలాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 227 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 15, భద్రాద్రి 69,జగిత్యాల 23, జనగాం 12, భూపాలపల్లి 16, గద్వాల 12, కామారెడ్డి 30, కరీంనగర్ 55 ,ఖమ్మం 75, ఆసిఫాబాద్ 7, మహబూబ్‌నగర్ 24 , మహబూబాబాద్ 21, మంచిర్యాల 24, మెదక్ 16, మేడ్చల్ మల్కాజ్‌గిరి 104, ములుగు 18, నాగర్‌కర్నూల్ 27, నల్గొండ 76, నారాయణపేట్ 3, నిర్మల్ 12, నిజామాబాద్ 30, పెద్దపల్లి 25, సిరిసిల్లా 32, రంగారెడ్డి 102, సంగారెడ్డి 24, సిద్ధిపేట్ 41, సూర్యాపేట్ 31, వికారాబాద్ 10, వనపర్తి 21, వరంగల్ రూరల్ 22, వరంగల్ అర్బన్ లో 51, యాదాద్రిలో మరో 18 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,30,274 కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,09,034కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

1300 దాటిన కోవిడ్ మరణాలు…

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1300 దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్ దాడిలో 1303 మంది చనిపోయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 55.04 శాతం మంది కో మార్పిడ్(వైరస్ సోకకముందు ఇతర ఆరోగ్య సమస్యలుండటం) కండీషన్‌తో చనిపోగా, 44.96 శాతం మంది కేవలం కోవిడ్‌తో మాత్రమే మరణించారని ఆరోగ్యశాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రతి పది లక్షల మందిలో లక్షా 8వేల మందికి పరీక్షలు…

రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో లక్షా 8 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే విధంగా ప్రతి రోజూ చేస్తున్న కరోనా పరీక్షల్లో 98 శాతం ప్రభుత్వం ఆధీనంలోనే కోవిడ్ టెస్టులు చేస్తున్నామని వైద్యశాఖ పేర్కొంది. దీంతో పాటు ఇప్పటి వరకు వైరస్ తేలిన వాళ్లల్లో 1,61,192 మందికి ఎలాంటి లక్షణాలు లేకుండా సొకగా, 69,082 మందికి లక్షణాలతో పాజిటివ్ తేలినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో వైరస్ బారిన పడిన వారు వేగంగా కోలుకుంటున్నారు. దీంతో రికవరీ రేట్ ఏకంగా 90.77 శాతానికి పెరిగింది. ఈ శాతం మరేరాష్ట్రాంలోనూ నమోదు కావడం లేదని హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడిస్తున్నారు.

ఆసుపత్రి నుంచి సినీనటి జీవిత డిశ్చార్జ్….

ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డ జీవిత పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు నెగటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ చేసి ఇంటికి పంపించినట్లు సిటీ న్యూరో ఆసుపత్రి శనివారం ప్రకటించింది. అయితే రాజశేఖర్ మాత్రం ప్రస్తుతం ఐసియూలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయననే నిరంతరం పర్యవేక్షిస్తోందని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా రాజశేఖర్ కూడా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News