Saturday, April 27, 2024

షీ టీం ఆవిర్భావానికి ఆరేళ్లు

- Advertisement -
- Advertisement -

Telangana She Teams completes six years

హైదరాబాద్: రాష్ట్ర మహిళల భద్రతకు సంబంధించి ఎన్నో వినూత్న అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, మహిళా భద్రతలో దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచినట్లు విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతిలక్రా తెలిపారు. రాష్ట్రంలో అతివల సంరక్షణే ధ్యేయంగా 2014 అక్టోబర్ 24న ఏర్పాటు చేయబడ్డ తెలంగాణ షీ టీమ్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతోందన్నారు. ఈ ఆరు సంవత్సరాలలో రాష్ట్రంలో నమోదైన ఎన్నోకీలక కేసులను పరిష్కరిస్తూ తెలంగాణ షీ టీమ్స్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని వివరించారు. 2014 అక్టోబర్ నుండి 2020 అక్టోబర్ వరకు ఆడవాళ్లకు సంబంధించి మొత్తం 30187 కేసులు తెలంగాణ షీ టీమ్స్ వద్దకు రాగా ఇందులో 3144 ఎఫ్‌ఐఆర్ లను నమోదు చేసిందన్నారు.

మిగతా కేసుల్లో దాదాపు ఇరవై వేలకు పైగా కేసుల్లో కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానాలు విధించించడం జరిగిందన్నారు. తెలంగాణ షీ టీమ్స్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండటంతో గ్రామాల్లో ఉన్న ఆడపిల్లలకు ఎంతగానో ఉపకరిస్తున్నాయని, ముఖ్యంగా ఈవ్ టీజింగ్ విషయాల్లో కానీ, గృహ హింస లాంటి కేసుల్లో కానీ ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్మిస్తూ తెలంగాణ షీ టీమ్స్ తన ప్రత్యేకతను చాటుకుంటోందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 2020 సంవత్సరం లో అతితక్కువ కేసులు నమోదు కావటం గమనార్హమని, ఇక మీదట కూడా ఇలాగే ఆడపిల్లల భద్రతకు ప్రాముఖ్యత నిస్తూ ముందుకు సాగుతామని విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతి లాక్రా పేర్కొన్నారు. తెలంగాణ షీ టీమ్స్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని యువతులకు ధైర్యాన్ని ఇస్తోందని, షీ టీమ్స్ చేస్తున్న కృషి వల్ల మహిళలు, ఆడపిల్లలు ఏదైనా ఆపద కలిగితే షీ టీమ్స్ ని సంప్రదించాలనే నమ్మకం కలుగుతుందని ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు.

Telangana She Teams completes six years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News