Tuesday, May 21, 2024

దేశంలో 12,781 కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

12781 corona cases reported in India

 

న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రోజువారి పాజిటివిటీ రేటు 4.32శాతం ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,09,473 చేరింది. ఇందులో 4,27,07,900 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 76,700 యాక్టివ్‌ కేసులుండగా.. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 5,24,873 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 18 మంది కరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 76వేలు దాటాయి. ఇప్పటి వరకు 196,18,66,707 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News