Thursday, May 2, 2024

రేపటి నుంచి పోస్టాఫీసుల ద్వారా రూ.1500 నగదు పంపిణీ

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 11వ తేదీ నుంచి రెండవ విడత పోస్టాఫీసుల ద్వారా రూ.1500 నగదు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీషరావు తెలిపారు. ఈ మేరకు శనివారం తన ట్విట్టర్ వేదిక ద్వారా తెలియజేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా పేదలు ఎవరూ ఆకలితో పస్తులు ఉండకూడదన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 1500లతో పాటు వ్యక్తికి 12 కిలోల చొప్పు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌కార్డు లింక్ ఉన్న ఖాతాలకు నేరుగా నగదును వేస్తోంది.

కాగా బ్యాంకు ఖాతాలు లేని వారికి పోస్టాఫీసు ద్వారా ఆర్ధిక సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో రెండవ విడత పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ డబ్బుల కోసం లబ్ధిదారులు ఎవరు గుంపులు గుంపులుగా పోస్టాఫీసుల వద్దకు వెళ్లవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. పోస్టాఫీసుల్లో జమ చేసిన డబ్బులు ఎక్కడికి పోవన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని ట్విట్టర్ వేదికగా లబ్దిదారులకు రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News