Tuesday, April 30, 2024

రూ. 3కోట్ల విలువైన పిపిఈ కిట్లు, మాస్కులు అందజేసిన ఎల్‌అండ్‌టీ

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత దేశపు సుప్రసిద్ధ్ద సాంకేతిక, ఇంజినీరింగ్, నిర్మాణ, తయారీ, ఆర్థికసేవల బహుళజాతి సంస్థ లార్సన్ అండ్ టౌబ్రో తెలంగాణ ప్రభుత్వానికి రూ.3 కోట్లు విలువైన పీపీఈ కిట్లు, 95 మాస్కులు అందజేసింది. శనివారం విడుదల చేసిన ప్రకటలో ఎల్ అండ్ టీఎంఆర్‌హెచ్‌ఎంఆర్ ఎల్ ఎండి కెవీబీరెడ్డి మాట్లాడుతూ.. భూమి మీద మానవాళికి అది అత్యంత కఠినమైన సమయమని హైదరాబాద్ మెట్రో రైల్ దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒకరి భద్రత, ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యాతాంశాలున్నాయన్నారు. ముఖ్యంగా కోవిద్‌తో జరుగుతున్న యుద్ధ్దంలో ముందుండి పోరాడుతున్న వారిని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. లాక్‌డాన్ ముగిసేనాటికి మెట్రో రైల్ తమ విలువైన ప్రయాణికులకు సురక్షితమైన ఆరోగ్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి సర్వసన్నద్ధం కానుంది. ఇది పెనుసవాల్‌తో కూడిన అంశమే కానీ, మా సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి, నేర్చుకోవడానికి ఇది ఓఅవకాశమన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News