Thursday, May 9, 2024

సిఎం కెసిఆర్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం

- Advertisement -
- Advertisement -

 

చెరువుల్లోకి చేరుకున్న రంగనాయకసాగర్ జలాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రంగనాయకసాగర్ కుడికాల్వ జలాలు నంగునూర్ మండలానికి చేరడంతో రైతులు ఆనందంతో పరశించి పోయారు. 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనే ఆనందంతో ఉప్పొంగిపోతూ సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. శనివారం రాజగోపాల్‌పేట చెరువులోకి రంగనాయకసాగర్ నుంచి గోదావరి జలాలు చేరడంతో ఆనందంతో సిఎంకెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధుకు 12 వందల కోట్ల రూపాయలను విడుదల చేసి కెసిఆర్ మరోసారి చరిత్ర సృష్టించారని రైతులు ఆనందంతో కెసిఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్‌పేట మాజీ సర్పంచ్ కోనేటి సత్యం, రైతుసంఘం అధ్యక్షుడు కాటం కనకయ్య, మత్యశాఖ నాయకుడు పూస రవీందర్, ఎస్‌ఎంసి మాజీ ఛైర్మన్ లక్ష్మయ్య, ఉప సర్పంచ్ మహేష్, వార్డు మెంబర్ మధు, ఉస్మానియా యూనిర్సిటీ విద్యార్థి నాయకులు శివ, బాలకిషన్ నాగరాజు, వంశీకృష్ణ, నవ్నీ,రాజు, హరికిషన్, నిశాంత్ తదితరులున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News