Thursday, May 2, 2024

హైదరాబాద్ మేయర్ బొంతుకు కరోనా

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసిలో 641, జిల్లాల్లో 952 మందికి వైరస్
కోవిడ్ దాడిలో ఎనిమిది మంది మృతి
హైదరాబాద్ మేయర్ బోంతు రామ్మోహన్‌కు కరోనా
జి.ఓ ప్రకారమే ఫీజులు తీసుకోవాలని మరోసారి హెచ్చరించిన వైద్యశాఖ
54,059కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి కొత్త ఫార్మాట్‌లో బులిటెన్‌ను విడుదల చేస్తామని ప్రకటించిన వైద్యశాఖ, ఆదివారం ఉదయం ఆ లెక్కలను వెల్లడించింది. శనివారం ఒక్క రోజు రాత్రి 8 గంటల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15,654 మందికి టెస్టులు చేయగా, 1593 పాజిటివ్‌లు తేలాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 641 మంది ఉండగా, ఆదిలాబాద్ 14, భద్రాది 17,జగిత్యాల 2, జనగాం 21, భూపాలపల్లి 3,గద్వాల 5, కామారెడ్డి 36,కరీంనగర్ 51, ఖమ్మం 18, మహబూబ్‌నగర్ 38, మహబూబాబాద్ 29, మంచిర్యాల 27, మెదక్ 21, మల్కాజ్‌గిరి 91, ములుగు 12, నాగర్‌కర్నూల్ 46, నల్గొండ 6,నారాయణపేట్ 7, నిర్మల్ 1, నిజామాబాద్ 32,పెద్దపల్లి 16, సిరిసిల్లా 27, రంగారెడ్డి 171,సంగారెడ్డి 61, సిద్ధిపేట్ 5, సూర్యాపేట్ 22, వికారాబాద్ 9,వనపర్తి 1, వరంగల్ రూరల్ 21, వరంగల్ అర్బన్ 131, యాదాద్రిలో పదకొండు మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 54,059కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 41,332కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 12,264మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 463కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్‌టిసిపిఆర్, 320 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు మరో 23 ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ పరీక్షలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా..
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తనకు వైరస్ లక్షణాలు లేకపోయినా ర్యాపిడ్ టెస్టు చేపించుకున్నానని దీంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన స్వయంగా వీడియో ద్వారా తెలిపారు. అయితే కోవిడ్ సోకగానే భయాందోళన చెందవద్దని ఆయన సూచించారు. అయితే తన కుటుంబ సభ్యులందరికీ నెగటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. హోం ఐసొలేషన్ చికిత్స అనంతరం తాను ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
జి.ఓ ప్రకారమే ఫీజులను తీసుకోవాలని వైద్యశాఖ మరోసారి హెచ్చరిక..
కరోనా వైద్యంపై ప్రైవేట్ హస్పిటల్స్ గతంలో విడుదల చేసిన జి.ఓలు 248,281ప్రకారమే ధరలు తీసుకోవాలని వైద్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు మరోసారి హెచ్చరించారు. వీటికి అదనంగా తీసుకోవద్దని మరోసారి గుర్తుచేశారు. అయితే ఇన్సూరెన్స్‌లు, కార్పొరేట్ అగ్రిమెంట్ కింద చికిత్స పొందితే జి.ఓ వర్తించదని వైద్యశాఖ స్పష్టం చేసింది.

1593 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News