Monday, May 6, 2024

13 వేలు దాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

13 వేలు దాటిన కరోనా మరణాలు
24 గంటల్లో 48,661 పాజిటివ్ కేసులు,705 మరణాలు

India crosses toll 13000 corona deaths

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 50 వేల కేసులతో విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా గడచిన 24గంటల్లో 48,661 పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,85,522 కు చేరుకుంది. ఇక దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 700కు పైగా మరణాలు నమోదవుతుతున్నాయి. తాజాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 705 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 32,063కు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో 8,85,576 మంది కోలుకోగా, 4,67,882 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తమిళనాడులో కేసుల సంఖ్య 2లక్షలు దాటగా, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో లక్షకు చేరువైనాయి.

కాగా శనివారం మరణించిన 705మందిలో మహారాష్ట్రలో 257 మంది ఉండగా, తమిళనాడులో 89 మంది, కర్నాటకలో 72 మంది, ఎపిలో 52 మంది మృతి చెందారు. కాగా తమిళనాడులో వైరస్‌నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శనివారం ఒక్క రోజే 7758 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య లక్షా 50 వేలను దాటింది. రాష్ట్రంలో రికవరీ రేటు 73 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.64 శాతంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 22.87 లక్షల టెస్టులు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఒకప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ఢిల్లీలో వైరస్ తీవ్రత గణనీయంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ కొత్త కేసులతో పాటుగా మరణాలసంఖ్య కూడా తగ్గుతోంది. శనివారం ఢిల్లీలో 29 మంది మాత్రమే వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో 30 మంది బ్యాంకు సిబ్బందికి కరోనా

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఒక జాతీయ బ్యాంక్‌కు చెందిన మెయిన్ బ్రాంచ్‌లో ఏకంగా 30 మందికి పైగా సిబ్బందికి కరోనా సోకింది. దీంతో బ్యాంకుకు వచ్చిన కస్టమర్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇంతకుముందు ఈ బ్యాంకులో ఓ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బ్యాంకులోని సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 30 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకినట్లు తేలింది.

India crosses toll 13000 corona deaths

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News