Friday, May 3, 2024

కరోనా టీకా వేసుకున్న 48 గంటల్లోనే యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్ ఎయిమ్స్‌లో మృతదేహానికి పోస్ట్ మార్టమ్

200 million vaccine doses from America to other countries

 

సెహోర్: మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 48 గంటల్లోనే ఒక 19 సంవత్సరాల యువకుడు మరణించాడు. వ్యాక్సినేషన్ నియమ నిబంధనలన్నీ పాటించామని, భోపాల్‌లోని ఎయిమ్స్ నుంచి పోస్ట్‌మార్టమ్ నివేదిక అందిన తర్వాత ఆ యువకుడి మరణానికి గల కారణాలు తెలుస్తాయని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం తెలిపారు. భన్వర్ గ్రామలో ఈ నెల 6వ తేదీన శుభం పర్మార్ అనే యువకుడు కొవిడ్-19 మొదటి డోసు టీకా వేసుకున్నాడు. టీకా వేసుకున్న తర్వాత అరగంట పాటు అక్కడే కూర్చున్న అతను మామూలుగానే తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతనికి వాంతులు కావడంతో ఆస్తాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సెహోర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా సోమవారం ఉదయం మరణించాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మృతదేహానికి భోపాల్‌లోని ఎయిమ్స్ డాక్టర్లు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత యువకుడి మరణానికి అసలు కారణం ఏమిటో తెలుస్తుందని ఆస్తా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News