Wednesday, May 1, 2024

క్రికెటర్ చిన్నారిని బెదిరించినందుకు హైదరాబాదీ అరెస్టు!

- Advertisement -
- Advertisement -

Hyderabadi detained
ముంబయి: ఓ హైదరాబాదీని ముంబయి పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అతడు ఓ భారతీయ క్రికెటర్ 9 ఏళ్ల కూతురును రేప్ చేస్తానని బెదిరించాడన్న ఆరోపణపై అరెస్టు చేశారు. టి20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయినందుకు అతడు ఇలా చేశాడని తెలుస్తోంది. అతడిని రామ్‌నగేశ్ అలీబతినిగా పోలీసులు గుర్తించారు. అతడు తెలంగాణకు చెందిన ఓ ఐటి ఇంజనీర్ అని, పిహెచ్‌డి చేయడానికి తన ఉద్యోగాన్ని కూడా అతడు వదిలేసినట్లు తెలిసింది. బాంద్రా(తూర్పు) బికెసిలో సైబర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీస్ అధికారి ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రికా విలేకరికి తెలిపాడు. కాగా ఆ అధికారి తన పేరు బయటపెట్టవద్దని కూడా కోరుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో క్రికెటర్ చిన్నారిని రేప్ చేస్తానని బెదిరించిన అతడిని హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు, అయితే వివరాలు తర్వాత వెల్లడిస్తామని ముంబయి పోలీసులు తెలిపారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News