Thursday, May 2, 2024

కరోనా ఉగ్రరూపం.. భారత్‌@5.5లక్షలు, ప్రపంచం@కోటీ 2 లక్షల కేసులు..

- Advertisement -
- Advertisement -

19459 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎంతలా అంటే.. రోజుకు 20వేల వరకు కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో 19,459 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, మరో 380 మంది కరోనా బాధితలు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో 5,48,318 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక, కరోనాతో దేశవ్యాప్తంగా మొత్తం 16,475 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83,98,362 కరోనా పరీక్షలు చేసినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజే 70,560 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,02,43,858 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా మొత్తం 5,04,410 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 55,53,495 మంది కోలుకోగా.. మరో 41,85,953 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

19459 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News