Friday, May 10, 2024

వింత వైరస్ తో 1900 పందులు మృతి

- Advertisement -
- Advertisement -

pigs

 

దిస్‌పూర్: వింత వ్యాధితో 1900 పందులు పైగా మృతి చెందిన సంఘటన అస్సాంలోని జరిగింది. దీంతో అస్సాం ప్రభుత్వం పంది మాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. అస్సాంలో ఎవరు పంది మాంస తినకూడదని ప్రకటన జారీ చేసింది. పందుల చనిపోయిన ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. వింత వైరస్ సోకి పందులు మృతి చెందాయని ఎన్‌ఇఆర్‌డిడిఎల్ సంస్థ ప్రకటించిందని వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా వెల్లడించారు. పందులు పెంచుతున్నవారిని క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న జాతీయ జంతు వ్యాధి పరిశోధనకారులు పందుల కళేబరాలను పరీక్షిస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న పందులకు వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వింత వైరస్ సోకి 1964 పందులు మృతి చెందాయని ప్రభుత్వం వెల్లడించింది. శివసాగర్ జిల్లాలో 1128 పందులు, ధీమాజీలో 616, దిబ్రుగఢ్ జిల్లా 107, జోర్హత్, లఖిమ్‌పూర్, భిశ్వనాథ్‌లో పందులు చనిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అస్సాంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా లేకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. అస్సాంలో 36 మంది కరోనా సోకగా ఒకరు మృతి చెందారు.

 

1964 Pigs dead with mystery virus in assam
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News