Tuesday, May 21, 2024

ఆన్‌లైన్ పాఠాలు: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు ప్రభుత్వ టీచర్లు అరెస్టు

- Advertisement -
- Advertisement -

arrest

హైదరాబాద్‌ః కరోనా కారణంగా ఇప్పట్లో విద్యాసంస్థలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో కొన్ని పాఠశాలలు, కాళేజీలు విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో పాఠాలను బోధిస్తున్నాయి. అయితే, ఆన్ లైన్ లో విద్యార్థులకు తరగతులు చెప్పే క్రమంలో కొందరు టీచర్లు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఆన్ లైన్ పాఠాలలో ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన  ఇద్దరు ప్రభుత్వ టీచర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్ లైన్ పాఠాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని అడిగిన ప్రశ్నలకు అసభ్యకరీతిలో సమాధానం ఇవ్వడమేకాక, అసభ్య మెసేజ్‌లతో విద్యార్థినిని ఇబ్బంది పెట్టారు. దీంతో సదరు విద్యార్థిని సైబరాబాద్ షీటీమ్‌ను ఆశ్రయించింది. విద్యార్థిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాబాద్‌కు చెందిన ఇద్దరు టీచర్లు శ్రీకాంత్, సురేందర్‌లను అరెస్టు చేశారు. నిందితులపై పీడి యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపిన పోలీసులు.. ఇద్దరు టీచర్లను రిమాండ్‌కు తరలించారు.

2 Govt Teachers Arrest for misbehaving with 9th Student

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News